సుప్రభాత కవిత ;- బృంద
తిమిరాన వేసారిన
సమస్త జగమూ
కిరణాలతో తమ
బాధలు చెబుతుంటే

వెలుతురైనా చీకటైనా 
నాకు తేడాలేదంటూ
చీకట్లో తడిసిన  దేహాన్ని
వెలుతురిచ్చే వెచ్చని వేడిలో 
చలి కాచుకుంటున్న రహదారి...

తెలివెలుగుల్లో ఊగుతూ
దినరాజు దారిలో 
గలగలా నవ్వుతున్న
పచ్చనాకుల వీవనలు

ఎరుపెక్కి పోవడానికి
తూరుపు వైపు పయనిస్తూ
పరుగులతో సందడి
చేస్తున్న పాలమబ్బులు

విజయం కనుచూపుమేరలో
కనపడుతుంటే కలిగే
ఉత్సాహపు ఉరుకులు
హృదయంలో చిందులేస్తుంటే

ఎనలేని వరములు పొందే
ఎల్లలు లేని ఆనందాన్ని తెస్తూ
ఎదురొచ్చే వేకువకు
ఎద పాడే ఉదయగీతం 

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు