శిబి చక్రవర్తి;- కొప్పరపు తాయారు

 ఆయన చాలా గొప్ప  వాడు. మంచి దయ కలిగిన వారు ఎవరు ఏది అడిగినా లేదనుకుండా ఇచ్చేవాడు ఒకసారి పెద్ద , యజ్ఞం చేసి అక్కడికి వచ్చిన 
యాగం చేసిన వారికి మహామహులందరినీ ఘనం గా
సత్కరించి లేదనకుండా అందరికీ కాదనకుండా
ఆయన మర్యాదలు చేయడం తో ఇంద్రుడు కొంచెం
మామూలుగానే ఏమిటి అని అనుకుంటాడు అలాంటిది ఒక చక్రవర్తి అనేసరికి పరీక్షించాలనే తపన  ఎక్కువై అగ్ని దేవుడు సహాయం తీసుకుని అతని పరీక్షించదలిచాడు
                     తాను డేగ గా మారి అగ్ని దేముడు
పావురం గా మారి శిబి చక్రవర్తి దగ్గరికి వెళ్లి నన్ను
రక్షించు రాజా, ఆ డేగ వలన నా ప్రాణానికి హాని
అని మానవ భాష లో మాట్లాడేసరికి  సభలోని
వారు ఆశ్చర్య పోయారు.కానీ రాజు ఆ పావురాన్ని 
నేను కాపాడు తానని మాట ఇచ్చాడు.
            ఇంత లోకి ఆ డేగ వచ్చే  నా ఆహారాన్ని నాకు కాకుండా చేయడం న్యాయమేనా అని అడిగే సరికి.నేను తన ప్రాణాన్ని నేను రక్షిస్తాని మాట
ఇచ్చాను.. నీకు ఆహారమే కదా ఎంత కావాలంటే 
అంత నేను నీకు ఏర్పాటు చేస్తానంటే ఆ డేగ, నాకు
దాని మాంసం కాక పోతే నీ మాంసం ఇయ్యి అంటేఆ
సరే అని వప్పు కుని .ఒక త్రాసు తెప్పించి ఒక పళ్ళెం
లో పావురాన్ని పెట్టి తాను శరీరం‌ నుంచి మాంసం
 కోసి వేస్తూ ఉంటే ఎంతకీ త్రాసు సరి తూగక ఉంటే
ప్రజలందరూ ఆ రక్తధారలు చూసి భయపడ్డారు.రాజు గారికి ఏమైనా అవుతుంది ఏమో
అని ,కానీ ఏకంగా తానే త్రాసులో కూర్చునే సరికి ఇంద్రుడు, అగ్ని దేముడు వారి వారి శరీరాలను పొంది నిన్ను పరీక్ష చేయడానికి ఇదంతా చేశాము.
నువ్వే గెలిచావు‌ అని ఆయనను దీవించారు.
కామెంట్‌లు