ప్రేమ కళ్ళు!!; - ప్రతాప్ కౌటిళ్యా
ప్రేమ నదిలాపొంగి ఆకాశంలో పారుతుంటే
భూమి దిగాలుగా దుఃఖాన్ని దిగమింగుకుంది.
సహనం మౌనంగా భూమికి దిక్కయింది.!!

చల్లని నీరు సలసలా కాగీ వేడెక్కినట్లు ఏడుస్తుంటే
హిమాలయం గుండె కరిగి గలగల చల్లగా పారింది.!!

గుండెల్ని పిండి రక్తాన్ని ప్రోగు చేస్తున్న మనసుని
అస్తిపంజరానికి వేలాడేసినట్లు ప్రేమ ఒప్పుకుంది.!!

నిదానంగా కొమ్మల వెంట జారుతున్న నీరు
ఆకుల్ని ముద్దాడి ప్రేమ సముద్రంలో మునిగి తేలుతుంది.!!

కాళ్లు చేతుల్ని కట్టేసిన రాలిపోతున్న చినుకుల్ని సరసాలాడినట్లు
మురళీ రాగాలు పలికిస్తుంటే
నెమలి పించం కొంచెం కొంచెం పురివిపుతుంది.!!

మెత్తని భూమి పొత్తిళ్లలో నర్తించే వర్షం
తడిసిన సిగలో సూర్యుని తురిమి అల్లుకుంది.!!

అలిగిన నెలవంక నేలపై కాలుమోపి మెల్లిమెల్లిగా కదులుతుంది.
కన్నార్పకుండా కడలి అలలా జారుతున్న కన్నీరు వెంట ప్రేమ పుట్టింటి కడప దాటింది తొలిసారి.!!

గవాక్షం లోంచి రాలుతున్న వెలుగును కౌగిలించుకొని
రాత్రంతా చిత్రమైన ప్రేమ చిగురిస్తే నక్షత్రాల్ని ప్రేమించింది.!!!

ఉట్టికి వేలాడేసిన వెన్నముద్దలని కొసరి కొసరి తినిపించిన
కాలం మనసు గెలిచిన ప్రేమ
పచ్చని పత్రం చిగురుస్తుంది మళ్ళీ!!!

రాలిపోతున్న ఆకులన్నీ ఉప్పొంగే సముద్రంలో
నావల్లామునిగి తేలుతుంటే
నిశ్శబ్దంగా నిష్క్రమించిన తుఫానులా
ప్రేమ మౌనంగా
వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతుంది!!!

ఒంటరిగా కరిగి ఒరిగిపోయిన మంచు పర్వతం
గడ్డ కట్టింది ఎందుకో తెలుసుకుంటుంది.!!

గంధం పూసిన పూలు
గగనం నుంచి రాలుతున్న నీళ్లు
మొగలి పొదల పొదరిల్లు
పరిమళాల ఇల్లు ప్రేమ చెక్కిళ్ళు!!!

చెలికత్తెల అందం ముందు
అద్దం ముందున్న అందం ప్రేమ కళ్ళు!!

కాలీ అందాల సవ్వడి విని సందెపొద్దులు
నిద్దుర మత్తులో మునిగిపోతుంటే
పారాణి ఆరని మబ్బుల్లో తొలిసారి ప్రేమ
నాలుగు దిక్కుల్లో దాక్కుంది!!!!!

Pratap Kautilya lecturer in Bio-Chem palem nagarkurnool dist
Honourable president Sri Sri kalavedika ( district)8309529273

కామెంట్‌లు