మనం అక్షరాలు నేర్చుకుంటే పిల్లలూ....ఈ ప్రపంచమే ఒక పుస్తకమై,మన ఈచేతిలోకి వచ్చేస్తుంది... !ఆ అక్షర జ్యోతుల వెలుగులోఈ భూగోళమే మిల - మిలా...మెరిసిపోతుంది... !ఆ అక్షరనక్షత్ర పుస్తకాకాశంలోఅంతరిక్షమంతా తళ -తళ లే!!అక్షర తరువును ఆశ్రయించినవారు ...సేద దీర్చే నీడనే కాదు....కడుపునిండే... మధుర ఫలాలనూ పొందవచ్చు !చదువంటే....గమ్యం చేర్చే మార్గం !బ్రతుకు బాటలో పరిమళం!చదువుకుందాం అందరం....అందరినీ చదివించుదాం !ఆ అక్షరదీపాల వెలుగులో...ఈ ప్రపంచాన్ని....ప్రకాశింపచేద్దాం.... !!*****************
అక్షరాలు ; - ...కోరాడ నరసింహా రావు !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి