శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ

 రాజతరంగిణి లో క్షత్రియులు 36వంశాలవారున్నారు.రాజస్థాన్ లో నాతరాయత్ రాజపుత్రులున్నారు.పంవార్ చౌహాన్ భాటీ సిసోదయా పడిహార్ సోలంకి రాఠౌర్ మొదలైన వారు వితంతు వివాహాలు ప్రోత్సహించారు.వారిని జాతి కులం నుంచి బహిష్కరణ గావించారు.విధవా వివాహం తో సంబంధం ఉందని నాతరాయత్ అన్నారు.హీనకులంగా వెలివేశారు.అగ్ని వంశక్షత్రియులు బైటనుంచి వచ్చిన శక వహిక్ జాతివారు.బ్రాహ్మణులకు సాయం చేశారు.వారి యుద్ధ నీతి వీరత్వం చూసి వారికి పవిత్ర సంస్కారం చేసి క్షత్రియులు గా మార్చారు.అగ్నికులంలో పుట్టారు అని కితాబు ఇచ్చారు.క్రీ.పూ.600లోభారత్ లోజిట్ జాట్ తక్షక అసి శక మొదలైన జాతులు ఉన్నాయి.హిందువుల్లో కలిసిపోయారు.మహాక్షత్ర మొదలైన బిరుదులు పొందారు.విదేశీజాతులు వైష్ణవ దీక్ష పుచ్చుకున్నారు.జాబులిస్థాన్ గాంధార్ రాజులు వీరు.శకవంశంవారు.వీరత్వంతో ఉత్తర భారత్ లో ఆధిపత్యం సంపాదించారు.ముసల్మాన్ కాలంలో ఆఫ్ఘనిస్తాన్ హిందూ మహాసముద్రం బాలిద్వీపంలో స్థిరపడ్డారు.రాయచూడ్ ఛోటానాగ్పూర్ నాగవంశీయులు గోవంశీ రాజపుత్రులు శివాజీ తంజావూర్ కొల్హాపూర్ లో కూడా వీరు విస్తరించారు.మరాఠీలో రాజపుత్ అంటారు 🌹
కామెంట్‌లు