శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ

 రాజపూత్ జాతివాచకశబ్దం రాజుకొడుకు రాకుమారుడు.శాసకులవంశంజులని రాజపూత్ అనేవారు.ప్రాచీనకాలంలో ఒక ప్రాంతం కి అధిపతి గా ఉండేవాడు రాజకుమారుడు.అశోకుడు కూడా ఉజ్జయిని తక్షశిల పాలకుడు అంటే నేటి 
గవర్నర్ లాగా అన్నమాట.రాజుకి సహాయసహకారాలు అందించే వాడు.రాజపూత్ రాజపుతానా ఒక ప్రముఖ క్షత్రియ సైనిక జాతి.పరిపాలన దేశ రక్షణ వారే చేసేవారు.ప్రాచీన వర్ణవ్యవస్థ వల్ల వీరికి క్షత్రియ అనేపేరు వచ్చింది.సూర్యవంశ చంద్రవంశ క్షత్రియులు అని రెండు రకాలు.అయోధ్యవారు సూర్య వంశం ఐతే చంద్రవంశంవారిది ఇలహాబాద్ కేంద్రం గా ఉండేది.మహాభారత యుద్ధం తర్వాత క్షత్రియ జాతి నిర్బలులై చాలా వంశాలు తుడిచి పెట్టుకు పోయాయి.దేశంపై పట్టు సడలింది. విదేశీయుల చేతిలోకి దేశం వెళ్లి పోయింది.పురాణకథప్రకారం వశిష్ఠుడు ఇతర ఋషులు ఆబూపర్వతంపై యాగం చేశారు.అగ్నికుండంలోంచి అగ్ని వంశక్షత్రియులు వచ్చారు.వారు పరమార్ చౌహాన్ సోలంకి పడిహార్ అనే పేరు తో ప్రసిద్ధి చెందారు.వీరి సాయంతో సూర్య చంద్ర వంశం రాజులు గుజరాత్  రాజపుతానా లో తమ ఆధిపత్యం నెలకొల్పారు.ఈమూడు కులాల్లోరాఠౌర్ శిశోదయ కఠవాహా తంవర్ భాటీ జాడేజా
గూజర్ చౌహాన్ పంవార్ సోలంకి పడిహార్ పరమార్ చెందేల్ బఘేల్ సోఢా సోన్గరా సాంఖలా దేవడా ఓరా ఇందా సాంచోటా బలోటే మొదలైన కులాలు ఇంటిపేర్లు వచ్చాయి.
కామెంట్‌లు