మహారాష్ట్రలోని కొల్హాపూర్ హిందువుల ప్ర ఖ్యాత పుణ్యక్షేత్రం. ఈ నగరంలో కొలువై వున్న మహాలక్ష్మీ దేవాలయం అత్యంత ప్రసిద్ధిగాం చింది. సకల సంపదలకు నిలయం శ్రీమహాలక్ష్మీ అమ్మవారు. ఆమె కరుణ తమపై ప్రసరించాలని కోట్లా ది భక్తులు నిత్యపూజలు చేస్తుంటారు. వైకుంఠంలో వుండే అమ్మవారు భక్తుల కోసం భూమిపై వెలసిన క్షేత్రమే శ్రీమహాలక్ష్మీ ఆల యం. అష్టదశ శక్తిపీఠాలలో శ్రీ మహాలక్ష్మిదేవి శక్తిపీఠంఎంతో ప్రాముఖ్యత గాంచింది. మహాలక్ష్మి అ మ్మవారు కోలహాసురుడును సంహరించి ఇక్కడ వెలసిందని అందుకే కొల్హాపూర్ అనే పేరు వచ్చిందనిస్థలపురాణం. కొన్ని చారిత్రక ఆహారా ప్రకారం పద్మావతి పరిణయం వేళ తిరుమలేశుడుపై అలిగిన మహలక్ష్మి అమ్మవారు ఇక్కడకు వచ్చి వెలిసిందని భక్తుల ప్రగాఢ నమ్మిక . స్కాంద పురాణం, దేవీ భాగవతాలలోఈ క్షేత్రాన్ని కరవీర నగరమని, దేవిని కరవీర మహలక్ష్మి అని ప్రస్తుతించారు. పరమశివుడికి కాశీ ఎలా అవిముక్త క్షేత్రమో, శ్రీ మహావిష్ణువుకి, లక్ష్మీదేవికి ఇది అవిముక్త క్షేత్రం. వారీ క్షేత్రాన్ని ఎప్పుడూ విడవకుండా వుంటారు. ఇక్కడ సతీదేవి నయనాలు పడినట్లు మరొక నమ్మిక.మహా లక్ష్మిదేవి మూల విరాట్‌పై నవంబర్, ఫిబ్రవరి మాసాలలో సూర్య కిరణాలు నేరుగా ప్రసరించడం ఇక్కడ విశేషం.సూర్యదేవుడు అమ్మవారి కటాక్షం కోసం ఏటా మూడురోజులు గర్భాలయంలోకి సూర్యకిరణాల ను ప్రసారిస్తాడు. తొలిరోజు పాదాలకు, రెండో రోజు నడుము భాగానికి మూడోరోజు శిరస్సు భాగానికి కిరణాలు ప్రసారిస్తాయి.మహారాష్ట్రీయులకు కొల్హాపూర్ మహాలక్ష్మి అత్యంత పవిత్ర యాత్రాస్థలం. వీరు అమ్మవారిని 'అంబాబాయి' అని పిలుస్తారు.శ్రావణమాసంలో ఈ ఆలయంలో అత్యధిక సంఖ్యలో భక్తులు వస్తారు. అమ్మవారిని దర్శించి రద్దీగా ఉంటుంది.పురాణాలలో ఈ ఆలయం గురించి ఉంది. ఈ క్షేత్రంలోనే శివునికీ, శ్రీ మహావిష్ణువుకూ ఉపాలయాలు ఉన్నాయి. ప్రాచీన, సనాతన భారతీయ నిర్మాణ శైలిలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది.
కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి వైభవం;- సి.హెచ్.ప్రతాప్

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి