మన సనాతన సంస్కార సాఫల్యాలకు ప్రతిబింబం హిందీ భాష అని, హిందీ మనది, హిందూస్తాన్ మనదని కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు అన్నారు.
హిందీ ఉపాధ్యాయులు
బత్తుల వినీల, బోనెల కిరణ్ కుమార్ ల నేతృత్వంలో నేడు జరిగిన హిందీ దివస్ కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా హిందీ ఉపాధ్యాయులు బోనెల కిరణ్ కుమార్ మాట్లాడుతూ మన భారతదేశంలోనే కాక, ప్రపంచ దేశాలలో కూడా హిందీ భాష ప్రాచుర్యంలో ఉందని, తద్వారా హిందీ భాష ఉన్నతిని చాటిచెప్పారు. హిందీ ఉపాధ్యాయని బత్తుల వినీల మాట్లాడుతూ హిందీ భాషతో మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు ముడిపడియున్నాయని అన్నారు. ఉపాధ్యాయులు తూతిక సురేష్ మాట్లాడుతూ హిందీ భాష పట్ల విద్యార్థులందరికీ నేటి కార్యక్రమం ద్వారా గొప్ప స్ఫూర్తి పెంపొందిందని అన్నారు. అనంతరం విద్యార్థిణీ విద్యార్థులు హిందీ దివస్ కు సంబంధించిన గీతాలకు నృత్య రూపకాలను ప్రదర్శించి అందరి ప్రశంసలు పొందారు.
హిందీ పాఠ్యాంశాలకు చెందిన బోధనాభ్యసనా సామగ్రితో చిన్నారులు పలు అభినయ రూపకాలను ప్రదర్శించారు. క్విజ్ పోటీల్లో దీప్షికాశ్రీ, రిషీతరుణ్ టీం లు గెలుపొందగా, వ్యాసరచన పోటీల్లో కావ్య, లావణ్య, లక్ష్మి, వక్తృత్వం పోటీల్లో జోహన, రేణుకాదేవి విజేతలుగా నిలిచారు. వీరికి బహుమతులను ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు, ఉపాధ్యాయులు తూతిక సురేష్, పెయ్యల రాజశేఖరం, బండారు గాయత్రి, వల్లూరు లక్ష్మునాయుడు, బత్తుల వినీల, పడాల సునీల్, కుదమ తిరుమలరావు, ముదిల శంకరరావు, కింజరాపు నిర్మలాదేవి, బోనెల కిరణ్ కుమార్, గేదెల వెంకట భాస్కరరావు, గుంటు చంద్రం, యందవ నరేంద్ర కుమార్, రబికుమార్ మహాపాత్రో, సస్మితా పాఢి, సింగంశెట్టి మురళీకృష్ణల చేతులమీదుగా బహూకరించారు.
అనంతరం మిఠాయి పంపకం జరిగింది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి