శబ్దసంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ

 యమనియమం పతంజలి యోగ శాస్త్రంలో ఈపదాలున్నాయి.మనసుకి సంబంధించినవి.మనసు బాహ్య క్షేత్రంని నియంత్రించేది యమ ఐతే మనసు ఆంతరికక్షేత్రంని నియంత్రణ లో ఉంచేది నియమం.పతంజలి రాజయోగం లో అహింస సత్యం అస్తేయ అంటే దొంగతనం చేయకపోవడం బ్రహ్మచర్యం అపరిగ్రహం బాహ్య జగత్తుకి సంబంధించినది.వీటినే యమం అన్నారు.శౌచ సంతోషం తపస్సు స్వాధ్యాయంమొదలైనవి ఆంతరికజగత్తు.ఇదే నియమం.
యగ్నోపవీతం జందెం వేసుకోవడం కి చేసే తంతు ఒడుగు.బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు తప్పనిసరి.16సంస్కారాల్లో ఇదొకటి.మూడుపోగుల సూత్రంతో ద్విజుడు ఔతాడు.రెండో జన్మ ఎత్తడం అన్నమాట.బ్రాహ్మణబాలునికి 8వ ఏట క్షత్రియ బాలునికి 11వ ఏట వైశ్యబాలునికి12వ ఏట ఉపనయనం చేస్తారు.దీనితర్వాత గురుకులంలో బ్రహ్మచర్య దీక్ష తో చదువు ముగించాలి.భిక్షావృత్తితో తనకు గురువు కి కావాల్సిన ఆహారం సంపాదించాలి.భిక్షాందేహి అని అడిగే బ్రహ్మ చారి కి గృహిణి తప్పక భిక్షవేసేది. కి.శే.ఘంటసాలవెంకటేశ్వరరావు గారు విజయనగరం లో భిక్షాటనంచేసి సంగీతం నేర్చుకున్నారు.ఆపై దేశ స్వాతంత్ర్యసమరంలో పాల్గొన్నారు.సినీప్లేబాక్సింగర్ గా ఆయన పాటలు నేటికీ అమృతపు ఊటలు.ఆయనపాడిన భగవద్గీత అజరామరం.🌷
కామెంట్‌లు