తప్పదు (వచన కవిత);- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 విడిచిన బాణం 
గమ్యం చేరక తప్పదు! 
పగలు రాత్రయినా 
తెల్లవారక తప్పదు! 
నీటి బొట్టయినా 
వాలుకు జారక తప్పదు! 
ఎగిసిపడిన ఆకు 
నేల ధూళిగా మారక తప్పదు! 
రేకు విప్పిన పూవు 
నేలరాలక తప్పదు! 
మాట జారినవాడు 
కన్నీట మునగక తప్పదు! 
తళుకు లీనిన మేను 
తగలబడిపోక తప్పదు!!
*********************************
:

కామెంట్‌లు