గుర్రంజాషువా (తేటగీతులు);- మిట్టపల్లి పరశురాములు
అంధకారముచేతను-అలమటించె
దీనజనులను దరిజేర్చ-దివ్యముగను
గబ్భిలమనెడికవనము-నబ్బురముగ
నందజేసెనుజాషువ-నవనియందు

ఫణికిక్షీరముప్రేమగ-పోయుజనులు
చీమ లకుజూడచక్కెర-చేరినొసగు
పేదవానికిబుక్కెడు-పెట్టబోరు
నలమటించగాగాంచేరు-నవనియందు

కులము మత్తులోమునిగిన-కువలయమును
తట్టిమేల్కొల్పె లెస్సగా-తరముమార్చ
నెల్ల జీవులరుధిరమ్ము-నెంచిజూడ
నొకటెననిచాటెజాషువ-నొప్పుగాను

మతముకొరకైనరణమును-మానుమనియు
కులముబేధంబుపాటించ-కూడదనెను
సకలమానవులొకటని-చక్కగాను
కలసినుండినమేలని-పలికెనతడు


నాల్గు పడగల హైందవ-నాగరాజు
బుసలుకొట్టుచుపరుగిడ-భువినియందు
ఇనుపగజ్జెలతల్లికి-నిడుముబాప
కంకణమ్మునుగట్టెను-కరుణజూపి

పేదబలహీనవారిని-పెంపుజేయ
కావ్యరచనలుజేసెను-కాపుజేసి
అంటరానితనమ్మును-నణచివేసి
బడుగు వర్గాలమేలుకై-పాటుబడెను
              ***


కామెంట్‌లు