శ్రీమాతా!- టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర.
అందము లొల్కుచున్ మోమున హాసపు వెల్గులు జిమ్మంగన్
గందువ నొప్పుచున్ జిల్గుల కంఠపు మౌక్తిక హారంబుల్
సుందర రూపివై నిల్వగ చోద్యము నొందిరి లోకుల్ యో!
బిందు నివాసినీ!కొల్తును ప్రేమను జూపుము శ్రీమాతా!


పట్టితి నీదు పాదంబులు భారము నీదని కై మోడ్తున్
బెట్టితి నీదు సింధూరము పేర్మిని జేసెద నీ సేవల్
గట్టిగ పల్కెద న్నామము కన్నుల గాంచెద రావమ్మా!
పుట్టుక లేనిమోక్షంబును బొందుగ నీయుము శ్రీమాతా!

చక్కని తల్లిరో!నీదరి సంతస మొందుచు చేరంగా 
మక్కువ మీరగన్ వచ్చితి మల్లెలు మొల్లలు చేకొంచున్
దిక్కని దల్చుచున్ మ్రొక్కితి దేవి!శుభంకరి నీ మ్రోలన్
బ్రక్కన రమ్ము!కాపాడగ!వైభవ కారిణి శ్రీమాతా!
----------------------------
;;-

కామెంట్‌లు