న్యాయాలు -267
వేతస న్యాయము
*****
వేతసము అంటే వానీరము,ప్రబ్బలి చెట్టు,నదుల ఒడ్డున పెరిగే ఒక రకమైన చెట్టు.
ఈ ప్రబ్బలి చెట్టు యేరు లేదా నదిని ఆనుకుని ఒడ్డున పెరుగుతుంది. అలలు, వరదలు వచ్చినప్పుడు వంగుతుంది. అవి తగ్గగానే లేచి తలెత్తుకుంటుంది.
ఈ వేతస న్యాయములోని అంతరార్థాన్ని సూక్ష్మంగా పరిశీలించి మన పెద్దలు యుక్తి గల మానవులకు అన్వయించి, అలా ఉండాలని చెప్పారు.
కొందరు బుద్ధిమంతులు, యుక్తి కలిగిన వారు శత్రువులు తమ కంటే బలమైన వారయినప్పుడు వారి యొక్క దుష్టత్వాన్నీ, ఆధిపత్యాన్ని ఎదిరించలేక వినమ్రులై తలయొగ్గుతూ వారి బారిన పడకుండా తమ జీవితాన్ని గడుపుతుంటారనే అర్థంతో ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
ఈ ప్రబ్బలి చెట్టును స్త్రీల శరీర సౌకుమార్యానికి గుర్తుగా చెప్పడం విశేషం .తిరుప్పావై పాశురాలలో పదిహేడవ పాశురంలో యశోదను వర్ణిస్తూ "ప్రబ్బలి చెట్టు వంటి సుకుమారమైన స్త్రీలలో చిగురు వంటి దానా మేలుకో ! "అంటూ గోపికలు మేల్కొలుపు పాడుతారు.
అదే విధంగా ఈ ప్రబ్బలి చెట్టు పూల గురించి పాల్కురికి సోమనాథుడు బండారి బసవన్న గురించి రాసిన ద్విపద కావ్యంలో ప్రస్తావిస్తాడు. "తామరపూల సుగంధంలో విహరించే తుమ్మెద ప్రబ్బలి పూల కోసం పరుగులు తీస్తుందా? అంటూ శివభక్తుడైన బండారు బసవన్న గొప్పతనాన్ని అందులో తెలిపాడు.
ఇవే కాకుండా కిరాతార్జునీయం రాసిన భారవి గారు 'ఆరవ సర్గలో' ప్రబ్బలి చెట్ల గురించి ఎంత గొప్పగా వర్ణించారో చూడండి."ఎత్తైన దేవదారు వృక్షాలను సైతం కూల్చగలిగే వేగంతో పారే గంగానదిలో నీటి ప్రబ్బలి చెట్ల సమూహం ప్రణామం చేస్తున్నట్లు అనిపించాయి.ప్రవాహ వేగానికి వంగుతూ, వేగం తగ్గగానే నిటారుగా లేచి నిలబడటం చూస్తుంటే అవి ఎంతో వినయవంతుల్లా అనిపించాయి." అంటారు.
ఇలా అనేక సందర్భాల్లో, కావ్యాల్లో ప్రస్తావించబడిన ప్రబ్బలి చెట్ల గురించి మనం అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే అంత సున్నితమైన చెట్లు కూడా వరదనీటికి ఎదురీదుతూ వాటి మనుగడను ఏ విధంగా కొనసాగిస్తున్నాయో మనుషులు కూడా అదే విధంగా అలాంటి పరిస్థితులను అధిగమించాలనీ చెప్పడం.అంతే కాకుండా అలా గడిపేవారిని ఉదహరించడం ఈ "వేతస న్యాయము" ద్వారా మనం గమనించవచ్చు.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి