వెల్లువలా పల్లవించే
ఉదయరాగాలు
మౌనమైన రేయికి
వెలుగుల వీడ్కోలు
వెల్లివిరియు కాంతిరేఖల
మిలమిలల లహరులు
గిరుల జారు ఝరుల
సితార సడుల సరిగమలు
కొండలన్ని కలయతిరుగు
మారుతపు పదనిసలు
కొమ్మలు ఊపే ఆకుల
తాళాల గుసగుసలు
భానుని రాకతో ధరణి
పొందు చైతన్యపు సరళి
ఇలలో ప్రతి అణువుకూ
ఇనుని రాకతో శోభలు
నింగి నుండి నేలకు వంతెనగా
దిగివచ్చు వెలుగు కిరణాలు
విరితోటను వికసించిన
సుమబాలల పరిమళాలు
విరిసే పువ్వుల నవ్వులు
గుడిలో వెలిగే దివ్వెలు
దైవము మనకిచ్చిన దీవెనంటి
ఉదయానికి
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి