ఆదర్శ జీవనం - నిజమైన జీవితం;- --- రవిబాబు పిట్టల, పర్యావరణవేత్త, హైదరాబాద్.
మనం వాడే ప్రతి మాట..,
ఇంకొకరిని ఆలోచింపజేసే తుపాకి తూట కావాలి...!

మనం రాసే ప్రతి రాత..,
ఇంకొకరి జీవితానికి తలరాత గీత కావాలి...!

మనం వేసే ప్రతి అడుగు..,
ఇంకొకరికి ఆదర్శ పూదోట తోట కావాలి...!

మనం చేసే ప్రతి పని..,
ఇంకొకరికి తరగని గని కావాలి...!

మనం చూసే ప్రతి చూపు..,
ఇంకొకరికి మార్గదర్శక ఊపు రావాలి...!

మనం తెరిచే ద్వారాలు..,
ఇంకొకరికి ఆదర్శ మార్గాలు కావాలి...!

మనం పాడే ప్రతిపాట..,
ఇతరులకు జీవిత గీతంగా మారాలి...!

మనం విప్పే ప్రతి చిక్కు ముడి..,
ఇతరులకు మేలుకొలుపు అవ్వాలి...!

మనం నాటే ప్రతి మొక్క..,
రాబోవు తరాలకు శ్వాసనివ్వాలి...!

మనం ఆడే ప్రతి ఆట..,
ఇతరులకు అనుసరించేలా ఉండాలి...!

మనం ఆలోచించే ప్రతి క్షణం..,
లోక కళ్యాణం కొరకై ఉండాలి...!

చివరికి మన జీవితం.., 
ఇంకొకరికి ఆదర్శ జీవనం కావాలి...!

ఇదే నిజమైన ఆదర్శ జీవితం...! 
ఇదే నిజమైన ఆదర్శ జీవనం...! 


కామెంట్‌లు