అద్భుతమైన బాల్యం
అందమైన కాలం
అన్నాచెల్లెళ్ల
అక్కా తమ్ముళ్ళ
బలీయమైన బంధం
పుట్టినప్పుడే మొదలయ్యే
అనురాగాల ప్రపంచం
ఆత్మీయ సమ్మేళనం...!
బుడిబుడి నడకలు నడిచే వేళ
బురదలో జారిపడిన వేళ
రక్షగా నా చేయి పట్టుకుని
నడిపించినది మొదలు
నన్ను వీపు మీద ఎక్కించుకుని
చెరువలో ఈత కొడుతూ
నాన్నగారితో దెబ్బలు తిన్న వేళ
అమ్మతో చెప్పకుండా
సినిమాకి తీసుకువెళ్లి
తిట్లు తిన్న వేళ
అత్తింట్లో సూదిలా గుచ్చే -
మాటలకు....
నేను ఉన్నానంటూ
నా చేయిని వదలకుండా
అనుక్షణం నీడలా
నా వెంట ఉంటూ
నా క్షేమాన్ని కాంక్షిస్తూ
నాకు భరోసా ఇచ్చావు!
ఆనందాల వేళ-
ఆనందం పంచుకున్నా ,
ఆవేదన వేళ ---
బాధను పంచుకున్నా !
ఆప్తకాల వేళ భగవంతునితో `
కాదు---కాదు...
నీతోనే పంచుకున్న !
ఎన్ని స్నేహాలు వున్నా
నా ఆత్మీయ స్నేహానివి నీవే
ఆత్మబంధువు నీవే కదా అన్నా!!
***
అందమైన కాలం
అన్నాచెల్లెళ్ల
అక్కా తమ్ముళ్ళ
బలీయమైన బంధం
పుట్టినప్పుడే మొదలయ్యే
అనురాగాల ప్రపంచం
ఆత్మీయ సమ్మేళనం...!
బుడిబుడి నడకలు నడిచే వేళ
బురదలో జారిపడిన వేళ
రక్షగా నా చేయి పట్టుకుని
నడిపించినది మొదలు
నన్ను వీపు మీద ఎక్కించుకుని
చెరువలో ఈత కొడుతూ
నాన్నగారితో దెబ్బలు తిన్న వేళ
అమ్మతో చెప్పకుండా
సినిమాకి తీసుకువెళ్లి
తిట్లు తిన్న వేళ
అత్తింట్లో సూదిలా గుచ్చే -
మాటలకు....
నేను ఉన్నానంటూ
నా చేయిని వదలకుండా
అనుక్షణం నీడలా
నా వెంట ఉంటూ
నా క్షేమాన్ని కాంక్షిస్తూ
నాకు భరోసా ఇచ్చావు!
ఆనందాల వేళ-
ఆనందం పంచుకున్నా ,
ఆవేదన వేళ ---
బాధను పంచుకున్నా !
ఆప్తకాల వేళ భగవంతునితో `
కాదు---కాదు...
నీతోనే పంచుకున్న !
ఎన్ని స్నేహాలు వున్నా
నా ఆత్మీయ స్నేహానివి నీవే
ఆత్మబంధువు నీవే కదా అన్నా!!
***
న్యూస్ లో ప్రచురించిన ఎడిటర్ శ్రీ వేదాంతం సూరి
గారికి, యాజమాన్యానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి