నేలపై పచ్చని చెట్లుగా
గాలిలో పూల పరిమళంగా
ఆకాశంలో నీలి మొయిలుగా
కడలిలో ఎగిసే అలలుగా
నింగిలో ఎగిరే పక్షులుగా
స్వేచ్ఛగా ఉండే పిల్లలం
నేడు
కార్పొరేట్ చదువులకు బందీలయ్యాం!
జైల్లో ఖైదీలుగా
టైం మెషీన్లుగా
పుస్తకాల పురుగులుగా
మస్తకాల్లో మత్తులుగా మారిపోతున్నాం
మాకు పండుగలేదు, పబ్బంలేదు,
బతుకమ్మలులేవు, బొడ్డెమ్మలు లేవు
పతంగులు లేవు, పటాకులు లేవు
ఆటపాటలు లేవు, అలయ్ బలయ్ లేవు
జనారణ్యంలో ఏకాంతద్వీప వాసం
చదువుల రోబోలుగా తయారవుతున్నాం
సమాజస్పృహ లేనివాళ్ళం
మాకు సమాజ సేవ ఎలా తెలుస్తుంది?
మమతల రాహిత్యంలో పెరిగిన వాళ్ళం
మాకు మానవత్వం
ఎలా ఒంటపడుతుంది?!
*********************************
చదువుల రోబో;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి