గాంధీజీ _ శాస్త్రిజీ ;-గంగరాజు పద్మజ హైదరాబాద్

 సర్వజన సర్వతోముఖ శుభాకాంక్షితులు
మహనీయమూర్తి ద్వయానికి
జన్మదిన శుభాకాంక్షలు
పుతలీబాయి రామదులారీ
మాతలగర్భాన జనియించి
దేశ మాత మ్రోల వెలిగిన జ్యోతులు
భారత్ చరిత్ర లో వారి జీవితాలు
భారతీయుల గుండె లో ఆరని దీపాలు
గుజరాత్ యు.పి.భారత్ కి అందించే మాణిక్యాలు
ఆటపాటల ప్రాయాన హరిశ్చంద్ర శ్రవణకుమారులు
నిలిచే ఆదర్శమూర్తులు
ఆటకు ఖర్జూర పూబంతులు
బడికి గంగానదిలో ఈతలు
పేదల దుస్తులు లేని దుస్థితికి వగచి కమీజు త్యజించే గాంధీ మహాత్ముడు
రైలుదుర్ఘటనకు చలించి మంత్రి పదవిని త్యజించే శాస్త్రీజీ
జాతిపితగా గాంధీజీ
జైజవాన్ జైకిసాన్ తో శాస్త్రీజీ
చరిత్రలో శాశ్వతం🌷
కామెంట్‌లు