తానా అంతర్జాతీయ కవి సమ్మేళనానికి ప్రత్యేక అతిథిగా కాదంబరి శ్రీనివాసరావు
 ఉత్తర అమెరికా తెలుగు సంఘం, తానా ప్రపంచ సాహిత్య వేదిక  సెప్టెంబర్ 9 వ తేదిన 
శ్రీ కాళోజీ నారాయణరావు జయంతి ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న "తెలంగాణ భాషా దినోత్సవం" సందర్భంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ కవి సమ్మేళనానికి తిమ్మాపురం కు చెందిన ప్రముఖ కవి, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు,MPUP స్కూల్, గుర్రాజుపేట, తెలుగు వెలుగు సాహిత్య వేదిక జాతీయ వేదిక అనకాపల్లి జిల్లా కో ఆర్డినేటర్ ను ప్రత్యేక అతిథిగా తానా  సంస్థ వారు ఆహ్వానించారు.
తానా వారు నిర్వహిస్తున్న ఇంతటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంలో తనకు విశిష్టమైన స్థానాన్ని కల్పించినందుకు తానా అధ్యక్షులు నిరంజన్ శృంగ వరపు గారికి, తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర గారికి, సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు. 
కాదంబరి శ్రీనివాసరావు గారు పలు పద్య, వచన కవితలు,గేయాలు,గజల్స్ వ్రాసారు
అంతర్జాలం లో తానా నిర్వహిస్తున్న ఈ  భాషా దినోత్సవం కార్యక్రమం యప్ టీవీ ద్వారా అనేక యూరప్ దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం అవటమే కాకుండా, తానా అధికారిక యూట్యూబ్ ఫేస్బుక్ చానల్స్ లో, ఈటీవీ భారత్ వంటి దాదాపు పది యూట్యూబ్ ఛానల్ లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
కాదంబరి గారికి అంతర్జాతీయ గుర్తింపు రావడం పట్ల పలువురు పెద్దలు, కవి పండితులు, గుర్రాజుపేట ప్రధానోపాధ్యాయులు శ్రీ కర్రి ధర్మారావు గారు, ఉపాధ్యాయ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తూ, అభినందనలు తెలిపారు

కామెంట్‌లు