అయ్యలసోమయాజుల ప్రసాద్ కు కుసుమ ధర్మన్న కళాపీఠం ఆత్మీయ సత్కారం.

  సంఘ సంస్కర్త, తొలి దళిత ఉద్యమ కవి, అణగారిన ప్రజలకొరకే 'మా కొద్దీ నల్లదొరతనం' అని నినదించిన పోరాట యోధుడు కుసుమ ధర్మన్న గారి జ్ఞాపకర్ధం వారి మనుమరాలు డాక్టర్ రాధా కుసుమ వ్యవస్థాపకురాలుగా స్థాపించిన కుసుమ ధర్మన్న కళాపీఠం వారు నిర్వహించిన రాష్ట్ర స్థాయి కవిసమ్మేళనం లో  సాహిత్యరత్న ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్  రసాయన శాస్త్ర విశ్రాంత శాఖాధిపతి విశాఖపట్నం వ్రాసిన 'దళిత ఉద్యమ వైతాళికుడు -ధర్మన్న' అని  రవీంద్రభారతి హైదరాబాద్ లో కవితాగానం చేసినపుడు సభాధ్యక్షుడు  సుప్రసిద్ధ కవి, సినీగేయరచయిత,దర్శకుడు డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ గారు, ముఖ్య అతిధి సాహితీవేత్త జడ్చేర్ల కలెక్టర్ డాక్టర్ ఏనుగు నరసింహా రెడ్డి గారు,గౌరవ అతిథులు హాస్యబ్రహ్మ డాక్టర్ శంకర్ నారాయణ గారు,సుప్రసిద్ధ గజల్  కవయిత్రి, భాషా పరిశోధకురాలు  శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి గారి సమక్షంలో  ధర్మన్న కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ రాధా కుసుమ గారు ప్రసాద్ మాష్టారు కి ప్రశంసాపత్రం, ,మొమెంటో, శాలువాతో ఆత్మీయ సత్కారం చేశారు. సాహితీమిత్రులు, శ్రేయోభిలాషులు ప్రసాద్ మాష్టారు కి అభినందనలు తెలియచేశారు. బదులుగా  అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం నాడే అంటరానితనం, అక్షరాస్యత కోసం పోరాడిన మహనీయులు కుసుమ ధర్మన్న గారి  కవితాలాపనకు సత్కారం పొందడం పూర్వజన్మ సుకృతం అని చెప్పారు..!!
కామెంట్‌లు