హైడ్రా! అచ్యుతుని రాజ్యశ్రీ

 గ్రీకు పురాణం లో మన పాములలాగా భయంకర సర్పం హైడ్రాకి 9తలలుంటాయి.ఈవిషసర్పం ఉండే సరసుపేరు లెర్నా.ఆసరసు విషపూరితమైఆనీరు తాగిన మనుషులు జంతువులు ప్రాణాలు పోయేవి.అంతా భయపడేవారు.దానికున్న వరం ఏమంటే తలను నరికితే కొత్త తల మొలుస్తుంది.హెర్క్యలిస్ తన మేనల్లుడు అయోలస్ తోహైడ్రా పనిపట్టాలని బైలుదేరాడు.అది వారిని చూస్తూనే బుస్ మంటూ 9పడగల్తో పైకి లేచింది.హెర్క్య్ లిస్ తనచేతి దుడ్డు కర్ర తో బాదినా తొలి చితికి నా కొత్త తల మొలుస్తుంది.తల తెగినాక దాన్ని కాల్చటంతో8తలలు నాశనం ఐనాయి. 9వతల మాత్రం చావులేనిది. దాన్ని కోసి నేలలో పాతి పెద్ద బండ దానిపై పెట్టాడు.దాని శరీరంలోని విషంని తన బాణాలకొసలకి పూశాడు. కాళింది మర్దనం.కాళీయసర్పం కృష్ణుడు చంపడం గుర్తుకి వస్తుంది కదూ🌹
కామెంట్‌లు