* కోరాడ నానీలు *

 నీ కష్టంతో గానీ 
  సుఖంతో గానీ... 
   కాలానికి పని లేదు... 
..  వెనక్కి  చూడదు! 
    ***************
నీచలి - ఉక్క... 
  దానికనవసరం  !
   గాలికి... 
   దానిధర్మం దానిదే.. !!
     *************
ప్రకృతి సమస్తం 
  దేనిధర్మాన్ని... 
  అది వీడదు... !
    కేవలం మనిషి తప్ప !!
       *************
సమస్త ప్రకృతిలో 
   వికృత  ప్రాణి ఏది ?
     ఈ మనిషి తప్ప  
      ఇంకేది.... !!
      ***************
సహజ ప్రకృతి లో... 
  కృత్రిమాలు సృష్టించే 
   విశ్వామిత్ర  మేధ... ?
     మనిషిదే గా.. !
కామెంట్‌లు