*అంశం:గురువు* -అన్నాడి జ్యోతిరెడ్డి*- :సిద్దిపేట‌*
*విద్య అనెడి ధనము విస్తారముగ యిచ్చి* 
*విశ్వమందు నిలుపు విజ్ఞులుగను*.
*సకల విషయములను చక్కగా నేర్పించి*,
*గుర్తింపు తెప్పించు గురువుయెపుడు*.!!

*ప్రజ్ఞ పెంచి గురువు ప్రావీణ్యులనుజేసి*
*సంఘమందు నిలుపు చతురులుగను*.
*చదువు విలువ చెప్పి సరిజేస్తు శిష్యులన్*
*శిల్పమల్లె మలచు శిల్పియయ్యి!!*

*అక్షరాలునేర్పి అందించుఫలములన్*
*కల్పతరువులాగా కాంక్షతోడ*
*అందుకున్నవారు ,ఆర్జించువారలు అన్నింట‌ిలోన ఆద్యులిలన!!*.

*ముందు వరుస నిలిచి  పొందు విజ్ఞానాన్ని*
*వెనుక బడినవంటె వెలుగు లేదు*.
*విద్యతోపాటుగావినయాన్ని అందించి*
*ప్రగతి పథము వైపు పంపు గురువు*.!!

*పూజ్యనీయులైన గురువు లందరికివే*
*అక్షర సుమాలతో*_
*వందనాలు అభినందనచందనాలు*.💐ట‌💐🙏🙏
         *అన్నాడి జ్యోతిరెడ్డి*✍️
              *సిద్దిపేట‌*
**********************************

కామెంట్‌లు