జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డీ త్రినాధరావు కుటుంబ సభ్యులను, అవార్డీల సంఘం పరామర్శ.


 ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత కామక త్రినాధరావు కుటుంబ సభ్యులను, అత్యుత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతల సంఘం (నేషనల్ అవార్డీ టీచర్స్ అసోసియేషన్) సభ్యులు కలిసి పరామర్శించారు. 
బుధవారం కుంటిభద్ర గ్రామంలో స్వర్గీయ త్రినాధరావు ఇంటికి వెళ్ళి, ప్రస్తుతం కొత్తూరు మండలం జెడ్పీటీసీ ఐన వారి శ్రీమతి భాగ్యవతి, వారి కుమార్తెలు శ్రీవిద్య, కమలకుమారి, కుమారుడు విద్యాసాగర్, కోడలు ఊర్మిళ, త్రినాధరావు తండ్రి దాలయ్యలను కలిసి పరామర్శించి, 
వారిని ఓదార్చారు. 
త్రినాధరావు చిత్రపటంవద్ద పూలమాలలు ఉంచి, త్రినాధరావు ఆత్మశాంతికై రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. త్రినాధరావు కుటుంబ సభ్యులకు మిక్కిలి ధైర్యాన్నివ్వాలని ఆకాంక్షిస్తూ తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసారు.
అనంతరం జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతల సంఘం (నేషనల్ అవార్డీ టీచర్స్ అసోసియేషన్) జాతీయ అధ్యక్షులు చౌధరి రాధాకృష్ణ మాట్లాడుతూ త్రినాధరావు విద్యా, సామాజిక రంగాల్లో ఘనమైన సేవలందించీ, సత్ఫలితాలు సాధించారని, వారి ఆకస్మిక మృతి ఈ సమాజానికి తీరని లోటని అన్నారు. 
జాతీయ అధ్యక్షులు చౌధరి రాధాకృష్ణతో పాటు, ఆ సంఘం కార్యదర్శి పారిశెల్లి రామరాజు, కోశాధికారి కొప్పల సూర్యనారాయణ, కార్యవర్గ సభ్యులు కుదమ తిరుమలరావు, వల్లభ మల్లయ్య, సభ్యులు అలిగి ధూళికేశ్వరరావులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వర్గీయ త్రినాధరావుతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
కామెంట్‌లు