తానా అంతర్జాతీయ కవి సమ్మేళనానికి ప్రత్యేక ఆహ్వానితులుగా డా.గౌరవరాజు సతీష్ కుమార్
 ఉత్తర అమెరికా తెలుగు సంఘం, తానా ప్రపంచ సాహిత్య వేదిక  సెప్టెంబర్ 9 వ తేదిన 
శ్రీ కాళోజీ నారాయణరావు జయంతి ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న "తెలంగాణ భాషా దినోత్సవం" సందర్భంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ కవి సమ్మేళనానికి జోగిపేట కు చెందిన ప్రముఖ కవి తెలుగు వెలుగు సాహిత్య వేదిక జాతీయ న్యాయనిర్ణేత  ప్రత్యేక  ఆహ్వానితులుగా తానా  సంస్థ వారు ఆహ్వానించారు.
తానా వారు నిర్వహిస్తున్న ఇంతటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంలో తనకు విశిష్టమైన స్థానాన్ని కల్పించినందుకు తానా అధ్యక్షులు నిరంజన్ శృంగ వరపు గారికి, తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర గారికి, సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు. 
డా . సతీష్ కుమార్  సుమారు వెయ్యికి పైగా కవితలు,కథలు,కథాగేయాలు,పద్యాలు,రాజశ్రీలు, చిటుకులు, నానీలు,మొగ్గలు, నవఛమక్కులు,చిట్టివ్యాసాలు, చిట్టికథలు,బాలగేయాలు, వ్యాసాలు, సైన్స్ సంగతులు ఇలా అనేక సాహితీ ప్రక్రియలలో తమరచనలు చేశారు.బాలసాహిత్యంలో 8 పుస్తకాలు,కవితా సంపుటాలు 2 వెలువరించారు. వీరి "బాలగేయాలు -భక్తిప్రబోధం"అనే పిహెచ్. డి. పరిశోధనా గ్రంథం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాదు నుండి స్వర్ణ పతకం సాధించింది. వీరు పలు సంస్థలనుండి  పురస్కారాలు, బిరుదులు,ప్రశంసాపత్రాలు పొందారు.
తెలుగు వెలుగు సాహిత్య జాతీయ వేదిక సంస్థ లో ప్రధాన భూమిక పోషిస్తూ అనేకమంది కవులను ప్రోత్సహిస్తున్నారు. 
అంతర్జాలం లో తానా నిర్వహిస్తున్న ఈ  భాషా దినోత్సవం కార్యక్రమం యప్ టీవీ ద్వారా అనేక యూరప్ దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం అవటమే కాకుండా, తానా అధికారిక యూట్యూబ్ ఫేస్బుక్ చానల్స్ లో, ఈటీవీ భారత్ వంటి దాదాపు పది యూట్యూబ్ ఛానల్ లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
డా.సతీష్ కుమార్ కు అంతర్జాతీయ గుర్తింపు రావడం పట్ల పలువురు పెద్దలు, కవి పండితులు హర్షం వ్యక్తం చేశారు.


కామెంట్‌లు