సుప్రభాత కవిత -బృంద
పట్టుకోలేని ప్రవాహం
తట్టుకోలేని వేగం
ఆపలేని ఆటంకాలు
ఆనందపు ఆత్రాలు

గమ్యం చేరే గమనంలో
ఒడిదుడుకుల పయనంలో
ఒక్కసారీ వెనుకకు తిరుగదు
ఒక్కక్షణం పరుగాపదు.

ఉదయమవక మానదు
పొద్దుగుంకక ఆగదు
అందరికీ ఒకటే  సమయం
అన్నిటా ఒకే న్యాయం

కాలచక్రపు  పరుగులో
సాగు జీవన వాహిని
జరిగిపోయే క్షణాలు
మారిపోయే  విలువలు

పుట్టుక ఒక ఘటన
చుట్టూ బంధాల  నటన
పట్టుకోని ఆధారాలు
కట్టుకున్న కలల మేడలు

కలిసిరాని మనుషులతో
కలవలేని మనసులతో
కమ్ముకున్న కలతలతో
కన్నీట నడిచే నావలు 

నిరాశను గెలిచేటి ఆశలు
నీరసం ఎరుగని శ్వాసలు
విధి ఆడే చదరంగపు పావులు
విడిపోని కడలీ..కెరటాలు

జీవనవాహినిలో మరో వేకువకు

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు