కాలుష్య నివారణకు చెట్లే ఆధారం



 పర్యావరణ పరిరక్షణకు, కాలుష్య రహిత వాతావరణానికి చెట్లే ఆధారమని, కావున విరివిగా మొక్కల్ని నాటాలని కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు అన్నారు. 
ఆంధ్రప్రదేశ్ నేషనల్ గ్రీన్ క్రాప్స్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించారు.
ఆంధ్రప్రదేశ్ నేషనల్ గ్రీన్ క్రాప్స్ 
కో ఆర్డినేటర్ తూతిక సురేష్ మాట్లాడుతూ మానవజాతికి, సమస్తకోటి జీవజాతుల జీవనానికి అవసరమైన ఆహారం వృక్షాలనుండి మాత్రమే సాధ్యమని, కాబట్టి అడవులను కాపాడాలని అన్నారు. 
వ్యాయామ ఉపాధ్యాయులు జన్ని చిన్నయ్య మాట్లాడుతూ 
చెట్లను నరకడం వలన ప్రాణవాయువు తగ్గుముఖం పడుతుందని తద్వారా జీవకోటికి బ్రతుకే ప్రమాదకరమౌతుందని అన్నారు.  
తెలుగు ఉపాధ్యాయులు వల్లూరు లక్ష్ముంనాయుడు, హిందీ ఉపాధ్యాయులు బోనెల కిరణ్ కుమార్, సాంఘిక శాస్త్రోపాధ్యాయులు కుదమ తిరుమలరావు, తెలుగు ఉపాధ్యాయులు ముదిల శంకరరావులు తరువులే మన ప్రత్యక్ష దైవాలంటూ బృందగానాన్ని ఆలపించారు. 
అనంతరం ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు, ఎ.పి.ఎన్.జి.సి. కి ఆర్డినేటర్ సైన్స్ ఉపాధ్యాయులు తూతిక సురేష్ లు పాఠశాల ఆవరణలో పలు మొక్కలు నాటారు. 
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు, ఉపాధ్యాయులు తూతిక సురేష్, దార జ్యోతి, పెయ్యల రాజశేఖరం, బండారు గాయత్రి, వల్లూరు లక్ష్ముంనాయుడు, బత్తుల వినీల, పడాల సునీల్, జన్ని చిన్నయ్య, కుదమ తిరుమలరావు, ముదిల శంకరరావు, కింజరాపు నిర్మలాదేవి, బోనెల కిరణ్ కుమార్, గేదెల వెంకట భాస్కరరావు, యందవ నరేంద్ర కుమార్, రబికుమార్ మహాపాత్రో, సస్మితా పాఢి, సింగంశెట్టి మురళీకృష్ణలు పాల్గొన్నారు.
కామెంట్‌లు