బాక్టీరియా అంటే ఏంటి?- ఎస్. మౌనిక

 హలో!హాయ్ మై డియర్ ఫ్రెండ్స్...... ఎలా ఉన్నారు? నేనైతే ఫుల్ హ్యాపీ.... మరి మీరు..? విష్ యూ ఏ వెరీ హ్యాపీ డే..... 🤝🤝బాక్టీరియా ఏక కణ జీవి. వీటి పరిమాణం అంగుళంలో 25వేలవంతుకు సమానమట! ఆకారంలో ఇవి చాలా చిన్నగా ఉంటాయి. కొన్ని ఇంతకంటే చిన్నవి కూడా..... ఇది మామూలు సూక్ష్మదర్శిని (microscope )కి కనబడవు.బ్యాక్టీరియాలో ఒక కణం రెండుగా విడిపోయి,రెండు బ్యాక్టీరియాలు అవుతాయి. కొన్ని పరిస్థితుల్లో వీటి పుట్టుక వేగం పెరుగుతుంది.కొత్త బ్యాక్టీరియా కణము  సుమారు 20 నిమిషాలలో విడిపోవడం మొదలవుతుంది. 40 నిమిషాలలో ఒక బ్యాక్టీరియా నుండి నాలుగు తయారవుతాయి. ఈ విధంగా 24 గంటలలో4,000,000,000 బ్యాక్టీరియాలో ఇవీటి బరువు భూమి బరువు కంటే 33 వేల రెట్లు అవుతుంది. కానీ నిజానికి అలా జరగదు. ఎందువలన అంటే వాటికి అన్న పానీయాలకు జరిగే సంఘర్షణలో ఒక శాతం మాత్రమే ప్రాణంతో మిగులుతాయి. తెలుసుకోవడానికి వింతగా ఉంది కదా ఫ్రెండ్స్...! ఇటువంటి ఎన్నో విషయాలను మీ నేస్తం మీ ముందుకు తెస్తూనే ఉంటుంది. మనం మళ్లీ ఇంకో కొత్త అంశంతో త్వరలోనే కలుద్దామా...? ఫ్రెండ్స్! సరే అయితే...ఉండనా మరి...? మళ్లీ త్వరలో మీ ముందు ఉంటాను... బాయ్ ఫ్రెండ్స్ 👋👋
కామెంట్‌లు