ఎవరు నేర్పారమ్మ?-గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్,భాగ్యనగరం
ఎవరు నేర్పారమ్మ
కోకిలమ్మకు
గళమెత్తి 
తియ్యగా పాడమని

ఎవరు నేర్పారమ్మ
నెమలికి
పురివిప్పి
చక్కగా నర్తించమని

ఎవరు నేర్పారమ్మ
జాబిలమ్మకు
చల్లని
వెన్నెలను వెదజల్లమని

ఎవరు నేర్పారమ్మ
కొమ్మకొమ్మకు
చక్కని
సుమాలను పూయించమని

ఎవరు నేర్పారమ్మ 
పువ్వుపువ్వుకు
సుగంధాలను
చుట్టూ చల్లమని

ఎవరు నేర్పారమ్మ 
గిజిగాడికి
గట్టిగా గూడునల్లమని
పిల్లలను జాగ్రత్తగాపెంచమని

ఎవరు నేర్పారమ్మ
ప్రకృతికి
అందాలు చూపమని
ఆనందం కలిగించమని

ప్రకృతిని
కాపాడుదాం
పర్యావరణాన్ని
రక్షించుదాం


కామెంట్‌లు
Srinivasa Rao Samrajyam చెప్పారు…
ఎవరు నేర్పారమ్మ ఈ ప్రసాదు కీ
ఇంత చక్కని కవితలు రాయమనీ.
Srinivasa Rao Samrajyam చెప్పారు…
ఎవరు చెప్పరమ్మ ఈ కవిగారికి
ఇంత కమ్మగ కవిత లు రాయమనీ
SrinivasaRao Samrajyam చెప్పారు…
ఎవరు చెప్పారమ్మ ఈ.కవి గారికీ
ఇంత కమ్మగ కవితలు రాయమనీ
SrinivasaRao Samrajyam చెప్పారు…
ఎవరు చెప్పరమ్మ ఈ కవిగారికి
ఇంత కమ్మగ కవిత లు రాయమనీ