తెలుగు దోహాలు;- - ఎం. వి.ఉమాదేవి

 63)
వృద్ధుల ఒంటరి తనములో, వీడిపోని గతముంది!
నీరవ నిశీథి చివరినే,వేకువయ్యెవీలుంది!!
64)
 మృత్యువు పిలిచిన నిమిషమే, వీగిపోవు మోహములు!
గొప్పనిజమొకటి తెలుస్తూ, జీవి తేటపడు గతులు
65)
నీతులు నిజములె కావులే, అవసరాలు సృష్ఠిoచు!
జాతులు వేరుగ నుండుచో నీతికథలు వేరుంచు!
66)
విప్లవ యోధుడు బెదరడే, పోరులోన తుదివరకు!
జాతిని చేతన పర్చగా, జయముకోరు కడవరకు!
67)
కొండ చరియలే విరిగినా, కుంగిపోదు గిరిజనము!
బండలు కొడుతూ బతికినా, చేయి చాపని సహనము!
68)
బాల్యమువీడని చోటనే, చిన్నిసంతసా లుండు!
కేవల ధనముకి పొoగనీ, నేవళాన్ని కలిగుండు!!
69)
హంసలు తిరిగే చోటులో, కాకిమసల గలదుసుమ!
గద్దలు ఎగిరే తోటలో, చిలకమనగ లేదుసుమ!
70)
బంగరు భవంతి ఉన్నదీ,మనసు శాంతిగానుంద?
లంగరు వేయని పడవలో, కుదురుగాను ఉంటుంద?
71)
బంగరు పళ్ళెము నిండుగా, భవ్యమైన భోజనము!
కడుపుకు అరగని తీరునే, సంపదలకు రాజసము!
72)
గెనిమల మధ్యన చేలలో, సేద్యగాని హృదిబంది!
అంకిత భావన లేనిచో, పంటతక్కు వేనంది!!
కామెంట్‌లు