అసలాగని కాలం
అందుకోలేని తీరం
అలవికాని కష్టాలు
అయినా తప్పదు పయనం
అడుగుకు తోడు అడుగే
చెదరని ధైర్యం గొడుగే!
అలుపుకు దొరకని గెలుపు
ప్రతి ఓటమీ ఒక మలుపు
ఆశించిన ప్రతీదీ దొరకదు
అందిన ప్రతీది నచ్చదు
కలతలకు తోడు కన్నీళ్ళు
ఉప్పునీటి చెలమలు కళ్ళు
మది అడుగున పొరలెన్నో
కప్పేసిన జ్ఞాపకాల అరలెన్నో!
గమ్యానికి గుమ్మం ఏదో!
ధ్యేయానికి మార్గం ఏదో!
దొరికిన ఈ జీవితం
అసలు చదవని పుస్తకం
బదులు లేని ప్రశ్నలూ
పాఠాలు వినని పరీక్షలు
తెలియని ఫలితాలు
అనుకోని మలుపులు
ఆశ ఒక్కటే ఆధారం
రేపు ఒక్కటే తెలిసిన సూత్రం
చెలిమిని పంచే కలిమివంటి
వేకువకు
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి