మనిషి
నడక సాగిస్తున్నాడు
నడక కొనసాగిస్తున్నాడు
అమిత వేగంతో
అమోఘ కాఠిన్యంతో
క్రోధావేశం అధిగమించినట్టు
నిష్ఠురతకు మించిన స్థితిని చేరినట్టు
ఉన్మత్త స్థితిని దాటేసినట్టు
అతడి వాలకం చెబుతోంది
అతడి నేత్రాలు
ఎక్కడో సుదూరంగా
అనంత విస్తృతిలోకి సారించబడ్డాయి
అతడి స్వరం
భీతి గొలిపేంత స్థిరంగా ఉంది
అతడు
తన నడక కొనసాగిస్తున్నాడు
అమిత వేగంతో
ధనార్జన అనే ఊబిలో!!
*********************************
నడక;- -డా.గౌరవరాజు సతీష్ కుమార్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి