"దైవ నిర్ణయం ";- కొప్పరపు తాయారు

 అందరూ గాబరాగా భయపడుతూ బాధపడుతూ కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ ఉన్నారు .సార్ శ్రీను, వాళ్ళ అన్నా రమణ కూడా దుఃఖపడుతూ  ఉన్నారు. వాళ్ళ అమ్మ చెయ్యి పట్టుకుని "అమ్మా లేమ్మా! నేను  శీను మాట్లాడమ్మా" అని ఒకటే ఏడుస్తున్నాడు. పక్కనే ఉన్న పిల్లలందరూ కూడా ఏడుస్తున్నారు ఎందుకంటే పిల్లలు దైవ స్వరూపాలు వారికి ఏమీ తెలియదు . అంచేత మాస్టర్ ఏడుస్తూ ఉంటే పిల్లలు కూడా పట్టుకొని ఏడుస్తున్నారు.
ఇంతలోకి మాస్టారు వాళ్ల పెద్దమ్మ వచ్చేరు "ఏమైందిరా శీను" అని అడిగారు
"మాస్టారు ఏమీ లేదు పెద్దమ్మ ,ఇద్దరం కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాం ,ఇంతలోకి కృష్ణుడు మురుకు తెచ్చి ఇచ్చాడు ఇస్తే తింటావా "అని అడిగాను.
"ఆ తింటాను ఇయ్యి "అంది.
"సరే !అంది కదాఅని, ఒక ముక్క ఇచ్చాను". 
 "అది నోట్లో పెట్టుకుంది, అంతే కాసేపయ్యేటప్పటికి ఆ మురుకుముక్క బయటకు వచ్చేసింది పాపం ఏమైందోనని ,నేను తీసేసి మూతి తుడిచేసి చెయ్యి తుడుస్తూ, ఉంటే ఆ చెయ్యి తిరిగి నేను పైకెత్తితే తిరిగి మళ్లీ కిందికే జార్చీసింది. పిలిస్తే పలకలేదు భయమేసింది పెద్దమ్మ" అన్నారు శ్రీను
"పిచ్చోడా భయం ఎందుకు హాస్పిటల్ కి తీసుకెళ్ళు"
అన్నారు.
ఆ పెద్దమ్మ అంటే ప్రాణం అందుకు గౌరవిస్తారు.
అంతే, అంతే శీను వాళ్ళ అన్న రమణ కలిసి ఆటో తీసుకొచ్చి ఆమెను తీసుకొని దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి తీసుకెళ్లారు.
    "అక్కడ అన్ని రకాల పరీక్షలు చేసి ఆమెకి మెదడులో రక్తం గడ్డ కట్టింది.అన్నారు. అందుకు ఆపరేషన్ అంటే ఆమెది ఆపరేషన్   చేసే వయసు కాదు కాబట్టి మందులే శరణ్యం.  మందులతోటే తగ్గించాలి  అదొక్కటే మార్గం అన్నారు డాక్టర్"
      పాపం ఇద్దరు అన్నదమ్ములు ఏడుస్తూ ఉన్నారు. ఆమెకు కదలిక లేదు రకరకాల గొట్టాలు పెట్టి ఆమెని పడుకోబెట్టారు.
 పెద్దమ్మకి ఫోన్ చేసి చెప్పారు అప్పుడు "పెద్దమ్మ ఏం పర్వాలేదు రా నువ్వు బాబాకు మొక్కుతావు కదా"! "అవును పెద్దమ్మ "అన్నాడు శీను." అంతే నమ్ముకో ఏం పర్వాలేదు "అంది.
  హాస్పిటల్ వాళ్ళు ఇంటికి తీసుకెళ్లండి అన్నారు.  కానీ పెద్దమ్మ అక్కడకీ చూడడానికి వెళ్ళింది. ఆమె సలహా మేరకు అక్కడే ఉంచడం మేలు అని 
శీను, రమణలకు చెప్పింది.
    ఆ మరుచటి రోజు శీను పిలుస్తూ ఉంటే అమ్మ కదిలింది. చెవి మూసుకుంది. అదే మాట పెద్దమ్మకి
పోన్ చేసి చెపితే ఆలోచించకండి .ఆమె ఆసుపత్రి లో
ఉంటేనే మంచిది.ఆమెకీ సేవ చేయాలంటే మీ వల్ల కాదుఅని. డాక్టర్లు నడిగి ఆక్కడే ఉంచారు 
     "ఏమీ ఆలోచించకండి మీకు దేవుడి మీద నమ్మకం ఉన్నది కదా ఆ సాయిబాబాని తలుచుకొని దండం పెట్టండి. అంతా మామూలుగా అయిపోతుంది బాధపడకండి " అని ఆమె చెప్పింది.
నాలుగు రోజులకు శీను ఫోన్ చేసి పెద్దమ్మకి "నువ్వు చెప్పినట్టే అమ్మ మాట్లాడింది "అన్నాడు ఆనందంగా.
"తప్పు నాన్న నేను కాదు నువ్వు నమ్మిన నీ సాయి బాబా "ఉన్నాడు "నీ ప్రార్ధన మన్నించాడు" అందుకే అమ్మ మామూలు అయింది చూసావా నమ్మకం ఎంత గొప్పదో అన్నది పెద్దమ్మ సంతోషంగా.
కామెంట్‌లు