"నీవే నా అందమైన ప్రకృతి - నీ రక్షణే నా జన్మాంతం ఆకృతి";- --- రవిబాబు పిట్టల, పర్యావరణ వేత్త, హైదరాబాదు.
నా ఆలోచన నీవు..!
నా తపన నీవు..!

నా ఆత్రం నీవు..!
నా గాత్రం నీవు..! 

నా అందం నీవు..!
నా ఆరాధన నీవు..!

నా సంతోషం నీవు..!
నా సాంతవన నీవు..! 

నా ఆశ నీవు..! 
కల్పించిన అభిలాషవు నీవు..!

నాలో ఉన్న ప్రేమ నీవు..! 
జాలువారే ప్రణయం నీవు..!

నా యాసవు నీవు..! 
దాని యొక్క ప్రాసవు నీవు..!

నా అనుభూతివి నీవు..!
నా బావుకథవు నీవు..!

నా ఆవేదన నీవు..!
దాని యొక్క ఆక్రందన నీవు..!

నా సర్వస్వం నీవు..! 
నా అమరత్వం నీవు..!

చల్లని చిరుగాలివి నీవు..!
దగదగ మెరిసే ఎండమావివి నీవు..!

సెలయేటి గలగలలో నీవు..! 
మరుమల్లె విరజాజుల్లో నీవు..!

కొండకోనల్లో పచ్చదనం నీవు..!
హిమగిరిలో ఉదయపు వెచ్చదనం నీవు..!

అందమైన జలపాతం నీవు..!
విరజిమ్ముతున్న నీటి దుంపరవు నీవు..!

అందమైన పైరగాలివి నీవు..! 
అందులోని చల్లని తుంపెరలు నీవు..!

హద్దులే లేని ఆకాశం నీవు..! 
ఎగురుతున్న స్వేచ్ఛ విహంగం నీవు..!

ఉదయ కిరణం తో మెరిసే బిందువు నీవు..! 
అనంతమైన అగాధం కలిగిన సింధువు నీవు..!

నీవు లేనిదే నేను లేను...! 
ఆ నీవే సృష్టించిన ప్రతిమను నేను...!

నీలో ఉన్న నేను ఉండాలంటే...!
నిన్ను నేను రక్షించుకోవాలి...!

నీవే నా అందమైన ప్రకృతి...!
నీవు లేకపోతే నా బ్రతుకంతా వికృతి...!

నీవే నాకు ఆది అంతం...!
నీవు లేనిదే నా బతుకంతా చిద్రం...!

******************************************************


కామెంట్‌లు