బుజ్జి సందేహాలు.. అచ్యుతుని రాజ్యశ్రీ
 బుజ్జి సందేహాలు! బొజ్జయ్య జవాబులు
ఏం చేస్తున్నావు బుజ్జీ? గణపయ్య ప్రశ్నకు
ఊ..నిన్నే? ఎంత పెద్దదో నీబొజ్జ?
బొజ్జ కాదిది శుభాలనొసగే భాండాగారం
ఆతొండం? తక్కువ మాట్లాడు అని తెలియజెప్పు
బాబోయ్!పేద్ధచెవులు
బాగా విని ఆలకించు పాఠాలు నీతికథలు
ఎలుక ఏది? మీరు రసాయనాలు విషపూరిత ఆహారం తో దాని ఉనికిని నాశనంచేస్తారని కైలాసం లో ఉంచా
రోడ్ ప్రయాణం కష్టం కదా
నీచిన్ని కళ్ళకి కళ్ళజోడు ఏది?
నేను స్మార్ట్ఫోన్ తో నీలాగా ఆడనుగా
ఆవిరితో ఉడికించిన ఉండ్రాళ్ళు కుడుములు తినరా బుజ్జీ
రకరకాల ఆకుపూజతో రోగనివారణ తెలుసుకో
నాట్యభంగిమతో ముద్దుల గణపతి శ్రీగణనాధ పిళ్ళారిగీతంతో తకతై అంటే
బుజ్జిగాడి కేరింతలు
రారమ్మని పిలుపులు
గౌరీసుతుని ఆశీస్సులు 🌷

కామెంట్‌లు