* నవరాత్రుల హేల షురూ !- కోరాడ నరసింహా రావు !
పది రోజుల ముందునుంచే... 
  చందాలకోసం... పిల్లలు డబ్బాల గల - గల లతో.... !

పెద్దల గుంపులు... చందా పుస్త కాలతో... ఇంటింటికీ, షాపు షాపు కీ..... !!

వినాయక నవరాత్రి మహోత్సవాల సందడి తో... 
.   ఊరూ - వాడా... !

రెండు నెలల ముందునుండే... 
 ప్లాస్టో  ప్లాస్టర్ తో  రక, రకాల రంగు, రంగుల భారీ విగ్రహాల తయారీ... ఊర్లకు కాస్తదూరంగా పొలిమేరల్లో !

ముద్దొచ్చే అందమైన మట్టి బాల గణేశుల బుల్లి - బుల్లి 
 విగ్రహాలు కుమ్మరి వీధుల్లో !!

నవరాత్రుల పూజలకని.... 
రంగులు అలంకరణలతో 
  అందముగా ముస్తాబయ్యే.. 
 వినాయక మండపాలు... !
ముంగిట పచ్చని చలువ పం దిళ్లు...మామిడి తోరణాలతో !!

తొలిపూజలందుకును బొజ్జ దేవర,చిన్నా పెద్దా మూర్తులతో 
తోపుడు బళ్ళు మొదలుకుని 
  అలంకరించిన లారీలపై... 
  బాజాబజంత్రీలు, పాటలహోరు, చిన్నా పెద్దా తేడా చూడక... దారిపొడుగునా డాన్సులతో... 
  బాలగణపతికీ... జై... !
  బొజ్జ గణపతికి... జై... !!
   విద్యా గణపతికి.. జై... !!!
..విజయ గణపతికి జై.. అంటూ... కోలాహలపు ఊరేగింపులు.. !!

వేదమంత్రాలు, మంత్రోచ్ఛరణలు... 
  పత్రీ, పువ్వుల పూజలు !
  రక - రకాల నైవేద్యాలు !!

సాయం సంధ్యలలో ప్రతి రోజూ 
రక - రకాలవినోద  కార్యక్రమములు... !
 
ఉల్లాసముగా, ఉత్సాహముతో 
జరిగే  ఈ నవరాత్రులు.... 
  స్తబ్దత నిండిన సమాజంలో 
   నూతనోత్తేజము నిచ్చే తీరును... !!
       *****&*&********

కామెంట్‌లు