కడుములో ముగిసిన ఎస్ జి ఎఫ్ -క్రీడా పోటీలు.

 శారీరక మానసిక వికాసానికి  క్రీడా రంగం ఎంతగానో దోహదపడుతుందని కడుము  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు అన్నారు.  స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్ జి ఎఫ్) ఆధ్వర్యంలో కొత్తూరు మండల స్థాయి క్రీడా పోటీల ముగింపు కార్యక్రమంలో తిరుమలరావు మాట్లాడారు. ఆయన అధ్యక్షతన జరిగిన ముగింపు సమావేశంలో ఎస్.జి.ఎఫ్. మండల అధ్యక్షులు జన్ని చిన్నయ్య మాట్లాడుతూ జాతీయ సమైక్యతకు, భారతీయ సంస్కృతికి క్రీడారంగం స్ఫూర్తినిస్తుందని అన్నారు. సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు కె.రాజారావు, బి.భాస్కరరావు, మహిళా వ్యాయామ ఉపాధ్యాయనులు ఎన్.అనితారెడ్డి, ఎస్.కావ్య, కృష్ణవేణి, గవర రేవతి ప్రసంగించారు.
ఈరోజు బాలికలకు కబడి, ఖోఖో, టెన్నికాయిట్, షటిల్ బ్యాట్మెంటన్, బాల్ బ్యాడ్మింటన్, యోగా, లాంగ్ జంప్, త్రోబాల్, అథ్లెటిక్స్ అనే 9 క్రీడాంశాలకు సంబంధించిన 10మంది వ్యాయామ ఉపాధ్యాయులు, సుమారు నూట ఏభైమంది  హాజరయ్యారని ఎస్ జి ఎఫ్ అధ్యక్షులు చిన్నయ్య తెలిపారు. ఈ తొమ్మిది క్రీడాంశాల పోటీల్లో విజేతలైన విద్యార్థిణీ విద్యార్థులు పాతపట్నం నియోజకవర్గస్థాయి ఎస్జీఎఫ్ సెలక్షన్లకు అర్హత పొందుతారని ఆయన అన్నారు. 
వారిని ఈనెల 11వతేదీ నుంచి 16వతేదీ వరకు కొరసవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు పంపించనున్నామని తెలిపారు. నియోజకవర్గ స్థాయి పోటీల్లో గెలుచుకున్న విజేతలు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఈ నెల 25వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరుగనున్న జిల్లా స్థాయి పోటీలకు అర్హతనొందుతారని చిన్నయ్య తెలిపారు. కడుము పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు జన్ని చిన్నయ్యతో పాటు మండలంలో గల వివిధ ఉన్నత పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు కె.రాజారావు (నివగాం), బి.భాస్కరరావు (నివగాం), కృష్ణవేణి (కురిగాం), ఎస్.కావ్య(వసప), వై.రామకృష్ణ (మాతల), జె.శ్రీనివాసరావు (కుంటిభద్ర), రమేష్ (కొత్తూరు), మురళి (లబ్బ), ఎన్.అనితారెడ్డి (మెట్టూరు), రేవతి (బలద), జి.వెంకటేశ్వరరావు (గొట్టిపల్లి)లు ఈ ఆటల పోటీలకు పర్యవేక్షకులుగా వ్యవహరించారు. 
కడుము పాఠశాల ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు ఉపాధ్యాయులు తూతిక సురేష్, దార జ్యోతి, పెయ్యల రాజశేఖరం, బండారు గాయత్రి,  వల్లూరు లక్ష్మునాయుడు, బత్తుల వినీల, జన్ని చిన్నయ్య, కుదమ తిరుమలరావు, ముదిల శంకరరావు, బోనెల కిరణ్ కుమార్, గేదెల వెంకట భాస్కరరావు, గుంటు చంద్రం, యందవ నరేంద్ర కుమార్, రబికుమార్ మహాపాత్రో, సస్మితా పాఢి, సింగంశెట్టి మురళీకృష్ణ పాల్గొన్నారు.
కామెంట్‌లు