తెలుగు దోహాలు;- ఎం. వి. ఉమాదేవి.

 53)
 కందిలి వెలుగుల నీడలో,కాలకఠినతయె   వుంది!
సుందర మైనది అయిననూ,శిథిలమౌతువుంటుంది!
54)
బొమ్మా బొరుసుల ఆటలో, గెలుపు చిత్రమవుతుంది
నవ్వూ ఏడుపు జంటగా, ఎదురుపడ్డ తీరుంది!
55)
ఆరిన బట్టల విధంగా, నిన్నునువ్వుమడతేయి
ఆత్మని క్షాళన చేయగా,హంసలాగ బతికేయి!
56)
కాలిన ఆశల వాసనే, కొందరున్నను వనమున!
రాలిన పువ్వుల గంధమే,తేటనవ్వు పవనమున!
57)
పాదము మోపిన దవ్వునా, పుడమితల్లి ముచ్చటలు
వేదము తెల్పిన విషయమే, ఆడపిల్ల అచ్చటలు!
58)
కొంచెం మౌనం వహిస్తే , ఆత్మఘోష వినవచ్చు
హాయిని పొందిన తీరుగా, లోని బోధ కనవచ్చు!
59)
మానదు గాయం మనసుకే , మంచిలేని చోటునను
తెలిసిన మనిషే చేసినా, బాధ తగ్గదేమికను!?
60)
వర్షం పడితే హర్షమే, పంటకోత లేనపుడు
రైతుకి హృదయం గుండమే, వరదవెల్లువైనపుడు!
6 1)
బ్రతుకున సమరం తప్పదే, చితికిచేరు వరకిచట 
మతినే మరచిన బాపతే, వెతుకులాడు జ్ఞానమట !62)
నమ్మిన వారికి ద్రోహమే, నరులుచేయుచెడ్డపని
పొమ్మన లేకను పొగలనే, పెట్టు పాపముండదని!
కామెంట్‌లు