మబ్బులు
చినుకులు రాలుస్తాయి
కలాలు
అక్షరాలు కురుస్తాయి
తారలు
తళతళలాడుతాయి
కైతలు
కళకళలాడుతాయి
చంద్రుడు
చక్కదనము చూపుతాడు
కవీంద్రుడు
కమ్మదనము కలిగిస్తాడు
రవి
కిరణాలు వెదజల్లుతాడు
కవి
కవనాలు వెలువరిస్తాడు
పరబ్రహ్మ
ప్రాణులను సృష్టిస్తాడు
కవిబ్రహ్మ
కవనాలను పుట్టిస్తాడు
పువ్వులు
మదులను ప్రేరేపిస్తాయి
కవితలు
పఠకులను ప్రోత్సహిస్తాయి
తేనె
నోరును ఊరిస్తుంది
కవిత
మనసును ఊరిస్తుంది
పలుకులు
పెదవులను కదిలిస్తాయి
కయితలు
పాఠకులను కదిలిస్తాయి
ఊహలు
తలల్లో ఊరతాయి
పదాలు
పుటల్లో పారతాయి
కవనకుసుమాలు
కట్టేస్తాయి
సుమాలసౌరభాలు
పట్టేస్తాయి
అక్షరాలు
అల్లుకుంటాయి
అర్ధాలు
అనుసరిస్తాయి
కవి
కదిలిస్తాడు
పాఠకుడు
స్పందిస్తాడు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి