మహోన్నతం- కొప్పరపు తాయారు

   అందరూ పనులు చేసి , కలిసే వాళ్ళు స్నేహితులు.
రాధ డాక్టర్, శారద ఇంజనీర్,   విమల లాయర్,
కమల లెక్చర్ ,పదిమంది స్నేహితులు. వీరికి చదువు,  చదువుకి తగ్గట్టు జ్ఞానం అది కాక, అంతే ఆత్మస్థైర్యం ఉంది. ఏదైనా కలిసికట్టుగా చేద్దాం అనే భావన ఒంటరితనం పనికిరాదు అని అనుకుంటారు.
      అలాగే ఇంట్లో కూడా అందరిని తృప్తిపరిచి ఉద్యోగాలు చేస్తుకుంటూ ఆనందం అనుభవిస్తున్నారు. ఏ రకమైన ప్రతిఘటన తమ వారితో గాని బయట వారితో గాని వారికి ఎప్పుడూ రాలేదు అంతటి జాగ్రత్తల మంతులు.
         వాళ్ళు మాట్లాడేది మనం చదువుకున్నాం, ఇప్పుడు కూడా నాకు అన్యాయం జరిగింది నాకు ఎవ్వరూ లేరు ,ఎవరు సహాయం చేయరు వంటి పిరికి మాటలు వద్దు! మనికి మన సంఘానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపడతామని, దానికి సంఘటితంగా చేస్తే సాధన, త్వరితగతి విజయాలు, ఫలితాలు,  ఉంటాయని ముందడుగు వేసిన మహిళలు వీరు.వీరిని చూస్తే లలిత మాత ఇన్ని రూపాల్లో దిగి వచ్చిందా అందరిని ఉద్ధరించడానికి అన్నట్టుగా అనిపిస్తుంది.
     సౌజన్య చదువుకుంటుంది .తండ్రికి అనారోగ్యం అంచేత అమ్మాయి వాళ్ళ అమ్మ , వారింట వీరింటా వంట సహాయం చేసి సంపాదించి ఇల్లు నెట్టుకువస్తుంది .అటువంటి సమయంలో సౌజన్య కాలేజీలో ఫీజు కట్టలేదని అవమానం చేస్తే కన్నీళ్లు పెట్టింది కానీ  ఎవ్వరికి చెప్పలేదు. ఇది ఎలాగో మన స్త్రీ శక్తి సౌరభాలకు తెలిసింది అంతే కాలేజీకి వెళ్లి ప్రిన్సిపాల్ గారిని అడిగారు ఆయన ఏదో చెప్పబోయే సరికి మీకు ఫీజు అడిగే బాధ్యత  ఉంది. కానీ అందరి ముందు అవమానం చేసే శక్తి ఎవరిచ్చారు మీకు. మేము ఫీజు ఇచ్చేస్తాం. అంతమందిలో అవమానించబడి న అమ్మాయికి న్యాయం ఎలా చేస్తారు. ఆ అమ్మాయి బాధని ఎలా తీసుకుంటారు వాపస్ అని పట్టుకున్నారు...
         దానికి భయపడి ప్రిన్సిపాల్ గారు అందరి ముందు ఆ పిల్లని రప్పించి క్షమాపణ అడగబోతే ఎక్కడైనా స్త్రీ శక్తి, స్త్రీ విలువలు అలాగే ఉంటాయి.
          సౌజన్య నమస్కరించి మాస్టారు మీరు నాకు తండ్రి లాంటివారు, మీరు చెప్తే మేము నేర్చుకోవాలి, అలాంటి మీరు మమ్మల్ని దండిస్తే అది ఆశీర్వాదం కింద తీసుకోవాలి, కానీ మీ మీద ప్రతీకారం తీసుకుంటామా సార్. అలా చేస్తే మా శ్రీజాతికే విలువ ఉండదు. మాలో క్షమాగుణం లేకపోలేదు అన్నది అంతే అందరూ అవాక్కయ్యారు..
          ****************
కామెంట్‌లు