సుప్రభాత కవిత ; - బృంద
కొలను మధ్యన కలువపూవులా
కొండలమధ్య వికసించే వెలుగుపువ్వు

నింగి కొంగు విదిలిస్తే
చుక్కలన్నీ కురిసి
నీలాల సంద్రాన
తేలియాడె దీపాలై!

అందని వరమేదో అందించే
అలలాగా పరచుకునే
అవని అంతటా
పలుచని వెలుతురు

శూన్యం పలికే ప్రణవంలా
కొండల మధ్య ఆదికావ్యంలా
సిరిజోతల జల్లులంటి
తెలివెలుగులసోయగాలు

పురివిప్పిన కోరికలు
రెక్కలొచ్చి ఎగిసి
మొగ్గ విచ్చుకున్నట్టు
జగతిని ఏతెంచె కాంతికలశం

మనసులోని మౌన మురళికి
ఊపిరులూదే చైతన్యం
ఆనందపు అందలమెక్కే
అమాయక అంతరంగం

ఎదుట పడ్డ వేకువకు
ఎద సడే స్వాగతంగా

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు