సుబ్బరాయుడు.;- టి. వి. యెల్. గాయత్రి
సీసమాలిక //

అంబికా పుత్రుడై నారుమోముల వేల్పు
లాలితంబుగ మమ్ము రక్షసేయు 
జవసత్త్వములిడి సంతాన భాగ్యంబు
కలుగంగ జేయునీ క్రౌంచభేది
తారకాసురవైరిఁ దల్చిన చాలును
తామస బుద్ధిని తఱిమివేయు
కార్తికేయుడు మన కష్టముల్ దీర్చుచు
నిల్చును తోడుగా నెమ్మిజూపి
కృత్తికాభవుడు మా కేలును బట్టుచు
నడిచివచ్చును గదా నమ్మకముగ
సుబ్బరాయని గొల్చి శుభములన్ బడసి
పుణ్యమంచు జనులు మ్రొక్కుచుంద్రు

తేటగీతి //

పార్వతీ సుతుని పదముల్ బట్టుకొనిన
భయములన్ బాపి కాచెడి వరదుడతని
పొగడుచుందురీ లోకులు పుణ్యవరుని
శాశ్వతుండగు వేల్పుకు జయము జయము.//

.

కామెంట్‌లు