ఓమ్ గురుభ్యో నమః;- శిరందాస్ శ్రీనివాస్- ప్రిన్సిపాల్-వైద్య ఆరోగ్య అనుబంధ వృత్తి విజ్ఞాన కళాశాల -నిజాం వైద్య విజ్ఞాన సంస్థ.
గురు బ్రహ్మ గురు విష్ణు 
గురు దేవో మహశ్వరః 
గురు సాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమః..

గురువు.. సాక్షాత్..
పరబ్రహ్మ అని వేదాలు చెబుతున్నాయి..

మాతృ దేవో భవ
పితృ దేవో భవ
ఆచార్య దేవో భవ  అని
తల్లి, తండ్రుల తరువాత గురువే దైవంతో సమానం అని పురాణాలు చెబుతున్నాయి..

గురువు కి మన సమాజం ఎంత ఉత్కృష్ట మైన స్థానాన్ని కల్పించిందో పై రెండు శ్లోకాలు చెబుతున్నాయి...

అమ్మ మనకు జన్మ నిస్తే
నాన్న మనకు నడక నేర్పితే 
నడత నేర్పేది గురువు..

విద్యా బుద్దులు చెప్పి మాంసం ముద్దను మనీషి గా తీర్చి దిద్దునది
గురువు.

అక్షరాలు దిద్దిచ్చి 
అక్షరాస్యుడిని చేసేది  గురువు..
అంధకారం తొలగించేది గురువు..

అమ్మ భాషకు అందాలు చెక్కి
బంధాల, అనుబంధాల 
సంస్కృతి ని నేర్పేది గురువు..

శాస్త్ర విజ్ఞానం పంచి
విజ్ఞాన వంతుడిని చేసేది
గురువు..

చరిత్ర బోధించి
భవిష్యత్తు కి పునాదులు వేసేది గురువు..

సంస్కృతి పాఠాలు చెప్పి
సంఘ జీవిని చేసేది గురువు..

మంచి చెడుల విచక్షణా 
జ్ఞానాన్ని పంచి
వివేకవంతుడిని చేసేది గురువు..

సామ బేద దండోపాయాలతో
చదువు చెప్పి
సంస్కారం నేర్పేది గురువు..

పర భాషలు నేర్పి
ప్రపంచాన్ని పరిచయం చేసేది గురువు..

మనలోని ప్రతిభను వెలికి తీసి 
పదును పెట్టి ప్రతిభావంతుడిని చేసేది గురువు..

బతుకు బడి ఎక్కాలు లెక్కలు చెప్పి బతుకు తెరువుకి 
బాటలు పరచేది గురువు..

గురువు గొప్పతనం
ఏకలవ్యుడి వృత్తాంతం చెబుతుంది మనకు...
గురు దక్షణగా 
ఏకలవ్యుడిలా ..
మనం మనబొటన వ్రేలిని 
ఇవ్వక్కర లేదు..
మన సర్వస్వం దారపోయ్యక్కరలేదు
కేవలం ప్రణమిల్లి
ఆ గురువులకు
శిరస్సు వంచి నమస్కరిస్తే
అదే పదివేలు..
అదే మన సంస్కారం..

ఢిల్లీ కి రాజైనా
తల్లికి కొడుకే అన్నట్లు
మరి గురువుకి శిష్యుడే కదా..

విద్యావేత్త, తత్వవేత్త 
ఉపకులపతిగా, రాయబారిగా
ఉప రాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా 
సేవలందించిన తెలుగు వెలుగు
డా: సర్వేపల్లి రాధాకృష్ణ గారు..
వారి జన్మ దిన వేళ 
గురు పూజొత్సవ శుభవేళ
నా జీవన ప్రయాణం కి 
అర్థం, పరమార్థం కల్పించిన గురుతుల్యులందరికీ..
వేన వేల వందనాలు
నాకు మార్గ దర్శనం చేసిన
మహానుభావులకు
మనః పూర్వక
కృతజ్ఞతలు.. .
🙏🙏🙏🙏🙏🙏


కామెంట్‌లు