కష్టం;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 ఎవరెస్టు శిఖరం ఎక్కడమంటే 
మా మేడెక్కినంత సులువు!
సప్త సముద్రాలు దాటడం 
చిటికెలో పని! 
చంద్రునిపై కాలనీలే కడుతున్నాం 
అక్కడికి వెళ్ళి రావడమంటే 
పక్క కాలనీకి వెళ్ళడమంత వీజీ! 
అంగారకుడి మీదికీ, బుధుడిమీదికీ, 
ఆఖరుకి శనిగ్రహనాంతర 
ప్రవేశం కూడా ఐంది! 
ఇవన్నీ ఎంతో సులభం! 
కాని.... 
నాపక్క మనిషి 
ఆంతర్యం మాత్రం 
నా జన్మలో గ్రహించలేను 
అది ఎంత కష్టమో కదూ?!
*********************************

కామెంట్‌లు