శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ
 రుద్రాక్ష అంటే రుద్రుని కళ్ళు.ఆచెట్టు గింజలతో రుద్రాక్ష మాల చేసి మెళ్ళో ధరిస్తారు.జపంచేస్తారు.విభిన్న ముఖాలతో రంగుల్లో ఉంటాయి.ఏకముఖిరుద్రాక్ష దుర్లభం.
రుహెల్ ఖండ్ అవధ్ కి దగ్గరగా ఉన్న ప్రాంతం.రుహేలే పఠాన్ జాతివారు ఇక్కడ స్థిరపడ్డారు.
రోజ్ నామచా ఫారశీ పదం.దీని అర్థం చిన్న పుస్తకం లో చేసిన పని రాయడం అంటే డైరీ అనుకోవచ్చు.దినచర్య పుస్తక్ దైనందినీ అని హిందీలో అంటారు.ఆదాయంవ్యయం రాసే పద్దుపుస్తకం గూడా.
రోమకూపాలు అంటే శరీరంలోని ఛిద్రాలు రంధ్రాలు.వీటిలోంచివెంట్రుకలు పుడతాయి.
లంగర్ అంటే లోహంతో చేసిన పెద్ద ఆయుధం.దీనితో నది సముద్రంలోని పడవ ఓడను ఆపవచ్చు.దీన్నే లంగరువేయడం అంటాం.ఆంగ్లంలో యాంకర్ అంటారు.చాలామందికి వంటచేసేచోటు తినే చోటుని కూడా లంగర్ అంటారు.సిక్కులలో లంగర్ ఆచారం ఉంది.గురుద్వారాలో లంగర్ ఉంటుంది.బఘేలీ భాషలోలాంగర్ శబ్దం ఉంది.లంగడా నించి వచ్చింది 🌹

కామెంట్‌లు