చెప్పండీ... జై జై..... ! *- కోరాడ నరసింహా రావు
మన దేశం గొప్పతనం... 
   తెలియునా మీకు పిల్లలూ... !
 ఏదేశ మేగినా ఆ దేశ భాష ఒక్కటే... !

మనకు, ప్రాంతీయ భాషలు....           ఎన్నో  ...ఉన్న ప్పటికీ...., 

మన దేశానికీ...మన దేశభాష  ఒకటున్నది.... 
      అదియే మన హిందీ... !
ఆ హిందీయే.... మనకు... 
   అధికార భాషర్రా  !!.

ఎన్నో రకాల పూల మాలగా 
  ఎన్నెన్నో... మన భారతీయ భాషల కంఠ హారంతో... 
  మనదేశమాత...
           అలరారుతున్నది !!

 ఎవరి ప్రాంతీయ మాతృ 
  భాషను వారు...      గౌరవించుతూనే 
   మన జాతీయ భాష హిందీ నీ 
   మనం గౌరవించే తీరాలి కదా... !

భాషలెన్నైనానేర్చుకోండిపిల్లలూ 
.విజ్ఞానాన్ని పెంచుకోండి... !
   
మన మాతృభాషను... 
     మన జాతీయ భాషను... 
      నేర్చుకున్న తరువాతే.. !!

మనల కన్న తల్లి..... 
  మన మాతృ దేశం... 
    ఆ స్వర్గం కన్నా... 
    గొప్పవే  పిల్లలూ... !

 చెప్పండీ జేజేలు.... 
     మన మాతృ భాష... 
       తెలుగుకు జై.... !
   మన జాతీయ భాష హిందీకి 
      జై... జై.... జై జై..... !!
         ****************

కామెంట్‌లు