శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ
 రాజీనామా ఫారశీ పదం.స్వీకృతిపత్రం అని అర్థం.రాజీ అంటే స్వీకృతి నామా అంటే లేఖ అని అర్థం.వాది ప్రతివాది కోర్టు లో కేసు కోసం ప్రవేశపెట్టిన పత్రం.కానీ మరాఠీలో త్యాగపత్రం రాజీనామా అంటారు.పదవిని త్యాగం చేయడం వదిలివేయడం కోసం పెట్టుకునే అర్జీ.
రాజ్యాభిషేకం అంటే రాజసింహాసనంపై కూచోబెట్టి వేదమంత్రాలతో పవిత్ర జలాల్ని ఓషధులను అభిషేకం చేయడం.దీన్ని రాజ్యాంగంలో
ణం అని కూడా అంటారు.
వేదకాలం లోసోమయగ్నాన్ని  రాజసూయం అనేవారు.కానీ కాలక్రమేణా రాజు అభిషేకం సంస్కారం గా మారింది.సామ్రాట్ పదవి పొందటం కోసం అనేక యగ్నాలు సమిష్టిగా చేసేవారు.చాలా రోజులు నడిచేది.అగ్నిష్టోమయగ్నం5రోజులు చేసేవారు.దిగ్విజయం కోసం యగ్నం చేశాక సామ్రాట్ అవుతాడు.ఒక్కోసారి రాజుని బాగా అలంకరించి ధనుస్సు బాణం ఇచ్చి ఇంకోరాజుతో కృత్రిమ యుద్ధం చేసి సామ్రాట్ పదవి పొందేవారు 🌹

కామెంట్‌లు