మానసిక స్థైర్యం ఆవశ్యకత- సి.హెచ్.ప్రతాప్
 నేటి యాంత్రిక జీవన విధానంలో మానసిక ఆరోగ్యం ప్రశ్నార్థకంగా మారింది. అలజడి, ఆందోళన, తదితర సమస్యలతో ప్రతివారి జీవితంలో ఓ భాగంగా మారాయి. ఒకప్పుడు విదేశాలలో మాత్రమే  ఒక తీవ్ర సామాజిక సమస్యగా రూపొందిన మానసిక సమసలు ఇప్పుడు మన దేశంలోకి కూడా చాప కింద నీరులా విస్తరిస్తోంది. ముఖ్యంగా యువతలో మానసిక సమస్యల తీవ్రత ఎక్కువగా వుంటోందని పలు అధ్యయనాలలో తేలింది. ముఖ్యంగా బాల్యం ప్ర‌తిఒక్క‌రికీ తీపి గురుతుగా ఉండాలి త‌ప్ప బాధాక‌రంగా గ‌డ‌వ‌కూడ‌దు. చిన్న‌పిల్ల‌లు ఒత్తిడికి గురైతే వారు పెరిగే కొద్ది దాని ప్ర‌భావం ఆరోగ్యం మీద ప‌డుతుంది. దీంతో గుండెపోటు, డ‌యాబెటిస్ వంటి వ్యాధుల బారిన ప‌డుతార‌ని అధ్య‌య‌నంలో తేలింది. అందుకే చిన్న‌పిల్ల‌ల‌ను ఆరోగ్యంగా, ఆనందంగా ఉంచాల్సిన బాధ్య‌త త‌ల్లిదండ్రుల మీద ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు.
డిప్రెషన్ ఏ సంవత్సరంలోనైనా 15 మంది పెద్దలలో ఒకరిని  ప్రభావితం చేస్తోంది మరియు ఆరుగురిలో ఒకరు  వారి జీవితంలో ఏదో ఒక సమయంలో నిరాశను అనుభవిస్తున్నారని తేలింది. డిప్రెషన్ ఏ సమయంలోనైనా సంభవించవచ్చు, కానీ సగటున, యుక్తవయస్సు చివరి నుండి 20 ల మధ్య వరకు మొదట కనిపిస్తుంది. పురుషుల కంటే స్త్రీలు డిప్రెషన్‌కు గురయ్యే అవకాశం ఉంది. కొన్ని అధ్యయనాలు మూడింట ఒక వంతు మంది స్త్రీలు తమ జీవితకాలంలో పెద్ద డిప్రెసివ్ ఎపిసోడ్‌ను అనుభవిస్తారని చూపిస్తున్నాయి అని వివిధ అధ్యయనాలు వివరిస్తున్నాయి.సైన్స్ జర్నల్ లాన్సెట్‌లో ప్రచురితమైన ఒక నివేదిక.. భార‌త్‌లో మానసిక వైద్య సహాయం అవసరమైన ప్రతి 10 మందిలో కేవలం ఒక్కరే సేవలు పొందగలుగుతున్నారని చెప్పింది.
ఇది ఇలాగే కొనసాగితే పదేళ్ల తరువాత ప్రపంచంలో మానసిక సమస్యల బారినపడినవారిలో మూడింట ఒక వంతు భారతీయులే ఉండొచ్చని ఆ నివేదిక అంచనా వేసింది. 

కామెంట్‌లు