మానవ జీవిత సాఫల్యానికి లక్ష్యం” అన్నది అత్యంత మౌలికమైన, ప్రధాన సాధనం. ఒక చుక్కాని లేని నావ దశ, దిశ లేకుండా కొట్టుకుపోతూ ఎప్పుడూ నడిసముద్రంలో మునిగిపోతుందో తెలియనట్లు సుస్పష్టమైన లక్ష్యం లేని జీవితం అగమ్యగోచరంగా, అస్తవ్యస్తంగా మారి నిష్ప్రయోజనకరంగా మిగిలిపోతుంది అంటారు సద్గురువు పత్రీజీ.అందుకే ఎవరి గురించి అయినా తెలుసుకోవాలంటే బాబూ! నీ లక్ష్యం ఏమిటి?” అని అడగాలని పెద్దలు చెబుతుంటారు.మానవులు తమ జీవితంలో ఒక స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే ప్రకృతే అతనికి కావలసిన వనరులను కల్పించి ఇస్తుందని శాస్త్ర వాక్యం. ఒకానొక విద్యార్థి “నేను నూటుకి నూరు మార్కులతో పాస్ కావాలన్న లక్ష్యంతో తన చదువును ప్రారంభించి కొనసాగిస్తే దానికి అనుగుణంగా అతనికి మంచి పాఠశాల, చక్కగా బోధించే ఉపాధ్యాయులు మరి పరస్పర సహకారాన్ని అందించే సహవిద్యార్థులు సమకూరుతూ ఉంటారు. ఇలా సమకూర్చడం ప్రకృతి యొక్క ధర్మం మరియు బాధ్యత.
పిల్లలుగా ఉన్నప్పుడే సమాజం నుండే పొందే గొప్పబలం ఇది. దీనిని సద్వినియోగం చేసుకోవడం అంటే, ఎదిగాక మంచి స్థాయిలో నిబడడమేనని అంటారు. జీవితం లక్ష్యం విద్యార్ధి దశలోనే ఆరంభం కావాలి. కొందరికి ఇష్టాలు పెద్ద పెద్దగా ఉంటాయి. అంటే ఐఏస్ అధికారి, ఐపిఎస్ అధికారి, ఎంఎల్ఏ వంటి హోదా గల పదవులు ఆశించవచ్చును. కొందరు ఒక కంపెనీకి సిఇఓ గా మారాలని అనుకోవచ్చును. ఇటువంటి లక్ష్యాలు సాధించడానికి చాలా కష్టపడాలి. ఇటువంటి లక్ష్యం నిర్ధేశించుకుని అందుకు తగిన సాధన చేయడంలో పట్టుదలను ప్రదర్శించాలి.
మనసు యొక్క గొప్పతనం ఏమిటంటే, ఏది పదే పదే అనుకుంటామో, ఆ పనిని అలవోకగా చేయగలుగుతుంది. కాబట్టి జీవిత లక్ష్యం హైస్కూల్ విద్యార్ధి దశలోనే ఏర్పడితే, ఆ యొక్క లక్ష్యమే దిశానిర్ధేశం చేస్తూ, మనసుని ముందుకు నడిపిస్తుంది. కావునా ఉత్తమ లక్ష్యం ఉత్తమ జీవనానికి పునాది అవుతుంది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి