ఒలంపిక్ క్రీడలు అంటే ఏమిటి?;- ఎస్. మౌనిక

 హలో!హాయ్ మై డియర్ ఫ్రెండ్స్...... ఎలా ఉన్నారు? నేనైతే ఫుల్ హ్యాపీ.... మరి మీరు..? విష్ యూ ఏ వెరీ హ్యాపీ డే..... 🤝🤝ఒలంపిక్ క్రీడలు ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జరుగుతాయని మీ అందరికీ తెలుసు. ఇంచుమించు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు ఇందులో పాల్గొంటాయి. అసలు ఒలంపిక్ క్రీడలు ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రారంభమయ్యాయి..... మీకు తెలుసా...? ఒలంపిక్ ఆటలకు చాలా ప్రాచీన చరిత్ర ఉంది.ప్రాచీన కాలపు ఒలంపిక్ క్రీడల గురించి ఎక్కువ సమాచారం లభ్యం కాలేదు.కానీ మొట్ట మొదటి ఒలంపిక్ క్రీడలు క్రీస్తుపూర్వం 776 సంవత్సరంలో గ్రీసు దేశంలో ఒలంపియా అనే చోటులో జరిగాయట!... ఈ ప్రదేశం యొక్క పేరుతోనే ఈ ఆటలకు కూడా ఒలంపిక్ క్రీడలు అని పేరు పెట్టుకోవడం జరిగింది.... మొదటిసారి జరిగిన ఈ క్రీడలు ఐదు రోజులపాటు జరిగాయి.ప్రారంభంలో గ్రీసు దేశస్తులు మాత్రమే ఒలంపిక్ క్రీడలలో ఆడేవారు.  గ్రీసు దేశస్థుల ముఖ్యదేవత అయిన జియాస్ ను పూజిస్తూ క్రీడలు జరిగేవి.ఈ ఆటలలో పాల్గొనే ప్రతి క్రీడాకారుడు ఆటలకు ముందుగా జియాస్ ను పూజించాలి.విజయం పొందిన ఆటగానికి జియాస్ దేవాలయం ఆవరణలో ఉన్న మర్రిచెట్టు కొమ్మను విజయ చిహ్నంగా బహుమతి ఇచ్చేవారట....! ఆ రోజుల్లో మహిళలను ఆటలు ఆడడానికి అనుమతించేవారు కాదు.... తెలుసుకోవడానికి వింతగా ఉంది కదా ఫ్రెండ్స్...! ఇటువంటి ఎన్నో విషయాలను మీ నేస్తం మీ ముందుకు తెస్తూనే ఉంటుంది. మనం మళ్లీ ఇంకో కొత్త అంశంతో త్వరలోనే కలుద్దామా...? ఫ్రెండ్స్! సరే అయితే...ఉండనా మరి...? మళ్లీ త్వరలో మీ ముందు ఉంటాను... బాయ్ ఫ్రెండ్స్ 👋👋
కామెంట్‌లు